అస్సామీ రాజకీయ నాయకుడు బెంజమిన్ బసుమతరీ నోట్లపై నిద్రిస్తున్నట్లు చూపించిన ఫోటో సంచలనమైంది. బసుమతరీ అస్సాంలో BJP మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL)లో ఉన్నాడు.
అస్సామీ రాజకీయ నాయకుడు బెంజమిన్ బసుమతరీ నోట్లపై నిద్రిస్తున్నట్లు చూపించిన ఫోటో సంచలనమైంది. బసుమతరీ అస్సాంలో BJP మిత్రపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL)లో ఉన్నాడు. అతడిని సస్పెండ్ చేశారు. వైరల్ ఫోటోలో.. బాసుమతరీ మంచం మీద పడుకుని ఉండగా.. తన ఛాతీ మీద, అతని చుట్టూ 500 రూపాయల నోట్ల కట్టలను ఉంచారు. మేము ఫోటో ప్రామాణికతను స్వతంత్రంగా ధృవీకరించలేకపోతున్నాం. వైరల్ ఫోటోపై వివాదం చెలరేగడంతో.. UPPL వెంటనే క్లారిటీ ఇచ్చింది. బాసుమతరీని పార్టీ నుండి దూరం చేసింది.
యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ప్రెసిడెంట్ ప్రమోద్ బోరో మాట్లాడుతూ.. జనవరి 10, 2024న పార్టీ నుండి అతడిని సస్పెండ్ చేశామని.. బాసుమతరీకి ఇకపై పార్టీతో సంబంధం లేదని అన్నారు. "జనవరి 5, 2024న హరిసింగ బ్లాక్ కమిటీ, UPPL నుండి ఒక లేఖ అందుకున్న తర్వాత అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం" అని బోరో చెప్పారు. బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (BTC) ఫిబ్రవరి 10, 2024న VCDC ఛైర్మన్ పదవి నుండి బాసుమతరీని సస్పెండ్ చేసింది. ఐదేళ్ల క్రితం బసుమతరీ స్నేహితులు.. పార్టీ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అని తెలిపారు. బాసుమతరీ చర్యలు పూర్తిగా అతని స్వంత బాధ్యత.. అతని వ్యక్తిగత చర్యలకు పార్టీ జవాబుదారీ కాదని UPPL తెలిపింది.