అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో కొలువు తీరిన బాలరాముడిని ప్రత్యక్షంగా తిలకించడానికి వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. త్వరగా రాముడిని దర్శించుకుందామనుకున్న భక్తులు ఓపిక పట్టలేక సెక్యూరిటీ గేట్లను దాటుకుని మరీ ఆలయంలోకి ప్రవేశించారు.

అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)లో కొలువు తీరిన బాలరాముడిని ప్రత్యక్షంగా తిలకించడానికి వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. త్వరగా రాముడిని దర్శించుకుందామనుకున్న భక్తులు ఓపిక పట్టలేక సెక్యూరిటీ గేట్లను దాటుకుని మరీ ఆలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో అక్కడ గందరగోళం నెలకొంది. ఇలాంటి సందర్భం కోసమే ఎదురుచూస్తున్న దొంగలు భక్తుల బ్యాగులను కొట్టేశారు. నగదు, ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పూర్ణిమ అనే భక్తురాలు రాముడి దర్శనం కోసం అయోధ్యకు వెళ్లి డబ్బు పోగొట్టుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించి రాముడిని దర్శనం చేసుకున్నారో లేదో తన బ్యాగులోని డబ్బు మాయం అయినట్టు గ్రహించారు. ఆమె బ్యాగును బ్లేడ్‌తో కోసి, అందులోని డబ్బును దొంగిలించారు దొంగలు. ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను కూడా ఎత్తుకెళ్లారని పూర్ణిమ తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన పూర్ణిమ స్నేహితురాలు ప్రాప్తి కూడా అయోధ్యకు వచ్చారు.
ప్రాప్తి బ్యాగ్ జిప్‌ను తీసి, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇత‌ర డాక్యుమెంట్ల‌ను దొంగిలించారు. తాను బ్యాగ్‌ను చాలా జాగ్ర‌త్త‌గా ప‌ట్టుకున్నాను. కానీ ఎలా జిప్ తీసి వాటిని అప‌హ‌రించారో తెలియ‌డం లేద‌న్నారు ప్రాప్తి. ఆ డాక్యుమెంట్ల‌ను మిస్‌యూజ్ చేస్తారేమోన‌నే భ‌యం ఉంద‌ంటున్నారు ప్రాప్తి. చోరీకి పాల్పడింది కచ్చితంగా అయోధ్యవాసులు మాత్రం కాదని ప్రాప్తి చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేరగాళ్ల పనేనని అయోధ్య వాసులు అంటున్నారు.

Updated On 23 Jan 2024 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story