ఫోన్ పే(Phone Pay) యూజర్లకు ఇది గుడ్ న్యూసే..! తమ కస్టమర్ల కోసం ఫోన్ పే ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌ను(Credit Score) చెక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకుగాను ఫోన్‌ పేలో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తన యూజర్లకు అవసరమైన ఫీచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తున్న ఫోన్‌ పే 'క్రెడిట్‌' అనే ఫీచర్‌తో ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. క్రెడిట్‌ స్కోర్‌తో పాటు..

ఫోన్ పే(Phone Pay) యూజర్లకు ఇది గుడ్ న్యూసే..! తమ కస్టమర్ల కోసం ఫోన్ పే ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌ను(Credit Score) చెక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకుగాను ఫోన్‌ పేలో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. తన యూజర్లకు అవసరమైన ఫీచర్లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తున్న ఫోన్‌ పే 'క్రెడిట్‌' అనే ఫీచర్‌తో ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. క్రెడిట్‌ స్కోర్‌తో పాటు.. ఆన్‌లైన్‌ పేమెంట్ల హిస్టరీ(Online Payment history), క్రెడిట్‌ కార్డుల నిర్వహణ(credit card), రుణాల చెల్లింపుల వివరాలు(Loan repayment), లోన్‌ ఎంక్వైరీ(Loan enquiry), సకాల చెల్లింపులు, డిలేడ్‌ చెల్లింపుల వివరాలను ఫోన్‌ పే అందిస్తోంది. మరి ఉచితంగా క్రెడిట్‌ స్కోర్‌ను ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

ఇందుకోసం ముందుగా ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా హోం పేజీలో క్రిడెట్ అనే ఆప్షన్‌ కనిపిసిస్తుంది. ఒకవేళ క్రెడిట్‌ ట్యాబ్‌ కనిపించకపోతే ప్లే స్టోర్‌లో యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. క్రెడిట్ బటన్‌పై క్లిక్‌ చేస్తే క్రెడిట్ స్కోర్‌ ఫర్‌ ఫ్రీ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని కిందే ఉన్న చెక్‌ నౌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీ క్రెడిట్ స్కోర్‌ను చూపిస్తుంది. ఈ స్కోర్‌ను ఎక్స్‌పీరియెన్ క్రెడిట్ బ్యూరో అందిస్తోంది. క్రెడిట్‌ కార్డుల బిల్లుల చెల్లింపులు, ఈఎంఐల చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే ఫోన్‌పే నెంబర్, పాన్‌కార్డుతో లింక్‌ అయి ఉన్న ఫోన్‌ నెంబర్‌ ఒకటే ఉంటేనే ఈ సదుపాయాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. క్రెడిట్ స్కోర్‌ నిర్వహణ, క్రెడిట్ స్కోర్‌ను పెంచుకునేందుకు కూడా ఇక్కడ సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపింది. లోన్లు పొందే అవకాశాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు ఫోన్‌ పే ప్రకటించింది.

Updated On 3 Jan 2024 2:22 AM GMT
Ehatv

Ehatv

Next Story