మధ్యప్రదేశ్ జబల్పూర్‌లోని ఓ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ వివాహితుడు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ జబల్పూర్‌లోని ఓ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చదువుతున్న ఓ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ వివాహితుడు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు 2022లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందిన అభినవ్ శ్రీవాస్తవ అనే వ్యక్తితో పరిచయమైంది. వారి స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. తరువాత, అభినవ్ ఆమెను లక్నోకు ఆహ్వానించి హిమాలయ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భవతి అవ్వగా ఆమెను మోసం చేసి జ్యూస్‌లో గర్భస్రావ మాత్రలు కలిపి తీసుకునేలా చేశాడు. గర్భస్రావం తర్వాత, ఆమెను మరోసారి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు కానీ తరువాత నిరాకరించాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బాధితురాలు 2021లో తన పీహెచ్‌డీ కోసం జబల్పూర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. తన స్నేహితుడు, అతని భార్యతో కలిసి నైనిటాల్‌కు విహారయాత్రంకు వెళ్తున్నామని చెప్పి కూడా వెళ్తున్నారని చెప్పి యువతిని లక్నో రప్పించాడు. మొదట బాధితురాలు నిరాకరించింది, కానీ అభినవ్ ఆమెను ఒప్పించడంతో అంగీకరించింది. ఆమె లక్నో వచ్చినప్పుడు అతను ఆమెను నైనిటాల్‌కు వెళ్లకుండా తన ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ, ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమెను ట్రిప్‌కు తీసుకెళ్లాడు. నైనిటాల్‌లో, తన స్నేహితుడు, అతని భార్య గొడవ పడుతున్నారని సాకు చెప్పి ఆమెను తన హోటల్ గదిలో ఉండాలని బలవంతం చేశాడు. అక్కడ, అతను మళ్లీ ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో లక్నోలో తరచుగాకలుసుకునేవారు. తన తల్లిదండ్రులతో మాట్లాడిన వెంటనే ఆమెను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. నవంబర్ 2023లో బాధితురాలు గర్భవతి అయింది.. ఇదే విషయం అభినవ్‌కు చెప్పింది. మొదట ఆమెను గర్భస్రావం చేయించుకోమని అడిగాడు, కానీ ఆమె నిరాకరించడంతో, వివాహం గురించి చర్చిస్తామని హామీ ఇచ్చి లక్నోకు పిలిచాడు. అక్కడ గర్భస్రావ మాత్రలతో కలిపిన జ్యూస్‌ను ఇచ్చాడు, గర్భస్రావం అయ్యేలా చూశాడు. ఈ సారి తప్పకుండా పెళ్లిచేసుకుంటానని హామీ ఇచ్చి జబల్పూర్‌కు పంపించాడు. కొన్ని రోజుల తర్వాత వివాహం గురించి చర్చించడానికి అతనికి ఫోన్ చేసినప్పుడు చేసుకోనని ఖరాకండిగా చెప్పేశాడు. రూ.50 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి అని షరతు పెట్టాడు. దీంతో బాధితురాలు ఖమారియా పోలీస్‌స్టేషన్‌లో అత్యాచార ఫిర్యాదు చేసింది. ఈ నేరం లక్నోలో జరిగినందున, కేసు దర్యాప్తు కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులకు బదిలీ చేశారు.
