Punjab : చదివింది పీహెచ్‌డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు.. చేస్తున్నది మాత్రం....!
ఆయన చదువులలో మర్మమెల్ల చదివేశాడు. సమాజపు మర్మాన్నే తెలుసుకోలేకపోయాడు. అదుకే అంతచదువుతూ చదివి కూరగాయాలు అమ్ముకుంటున్నాడు. ఆయన పేరు డాక్టర్ సందీప్ సింగ్(Dr. Sandeep Singh). 39 ఏళ్ల ఆ పంజాబీ పీహెచ్‌డీ (PhD)చేశారు. నాలుగు మాస్టర్ డిగ్రీలు(4 Master's Degrees) చేశారు. అంత చదువు చదివిన ఆయనకు మంచి ఉద్యోగమే వచ్చి ఉంటుంది కదా! పంజాబీ యూనివర్సిటీ న్యాయవిభాగంలో (Punjabi University's law department ) ప్రొఫెసర్(professor) ఉద్యగం దొరికింది.
ఆయన చదువులలో మర్మమెల్ల చదివేశాడు. సమాజపు మర్మాన్నే తెలుసుకోలేకపోయాడు. అదుకే అంతచదువుతూ చదివి కూరగాయాలు అమ్ముకుంటున్నాడు. ఆయన పేరు డాక్టర్ సందీప్ సింగ్(Dr. Sandeep Singh). 39 ఏళ్ల ఆ పంజాబీ పీహెచ్‌డీ (PhD)చేశారు. నాలుగు మాస్టర్ డిగ్రీలు(4 Master's Degrees) చేశారు. అంత చదువు చదివిన ఆయనకు మంచి ఉద్యోగమే వచ్చి ఉంటుంది కదా! పంజాబీ యూనివర్సిటీ న్యాయవిభాగంలో (Punjabi University's law department ) ప్రొఫెసర్(professor) ఉద్యగం దొరికింది. కానీ కాంట్రాక్టు జాబ్! ఏదైతేనేమీ అనుకుని ఆయన 11ఏళ్లు పనిచేశారు. అక్కడ ఇచ్చే చాలీచాలనీ జీతంతో అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ జీతం కూడా టైమ్‌కు వచ్చేది కాదు. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇక లాభం లేదనుకుని బతుకుదెరువు కోసం కూరగాయలు అమ్మడం మొదలుపెట్టారు. న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి, జర్నలిజం(journalism), పొలిటికల్ సైన్స్‌లలో మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తి ఇలా కూరగాయలు అమ్ముకోవడం ఏమిటి? అదే కదా దౌర్భాగ్యం. అరకొర జీవితంతో తాను, తన కుటుంబం బతకడం కష్టంగా మారడతో కూరగాయలు అమ్ముతున్నట్టు సందీప్ సింగ్ చెప్పారు. తన కూరగాయాల బండిపై పీహెచ్‌డీ సబ్జీవాలా (PhD Sabzi Wala)అనే బోర్డు పెట్టుకుని మరీ ఇంటింటికి తిరుగుతూ కూరగాయాలు అమ్ముకుంటున్నారు. ప్రొఫెసర్‌గా సంపాదించిన దానికంటే కూరగాయాలు అమ్మడం ద్వారానే ఆయన ఎక్కువ సంపాదిస్తుండటం విశేషం. కూరగాయలు అమ్ముకుంటూనే చదువు కొనసాగిస్తున్నారు. చదువు చెప్పడం అంటే తనకు చాలా ఇష్టమని, ఎప్పటికైనా సొంతంగా ఓ ట్యూషన్ సెంటర్‌ను స్టార్ట్ చేస్తానని చెప్పారు. అందుకోసం ఇప్పట్నుంచే డబ్బు కూడబెడుతున్నానన్నారు. సందీప్ సింగ్‌లాంటి వాళ్లు మన దేశంలో చాలా మందే ఉంటారు.