దేశంలో అయిదో దశ పోలింగ్(Polling) ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కుం టున్నారు.
దేశంలో అయిదో దశ పోలింగ్(Polling) ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కుం టున్నారు. ఈ దశ పోలింగ్‌లో కాంగ్రెస్(Congress) ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh), స్మృతీ ఇరానీ(smrithi Irani), జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar abdulla) తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 695 అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ దశలో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా, ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు. గత నాలుగు దశల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఆందోళన చెందిన ఎన్నికల సంఘం ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. మహారాష్ట్రలో 13 స్థానాలు, ఉత్తర ప్రదేశ్‌లో 14 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో ఏడు స్థానాలు, బీహార్‌లో అయిదు స్థానాలు , ఝార్ఖండ్‌లో మూడు స్థానాలు, ఒడిశాలో అయిదు స్థానాలు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో చెరో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి..