గడ్డాలు(Beard), మీసాలు(mustache) పెంచుకోవడం కూడా తప్పేనంటే ఎలా? ఇప్పుడది ఫ్యాషన్ కూడానూ! కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని(Himachal Pradesh) ఓ ఫార్యాస్యూటికల్ కంపెనీ(pharmaceutical company) మాత్రం తప్పేనంటోంది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చిన 80 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి తొలగించింది.

Solan
గడ్డాలు(Beard), మీసాలు(mustache) పెంచుకోవడం కూడా తప్పేనంటే ఎలా? ఇప్పుడది ఫ్యాషన్ కూడానూ! కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని(Himachal Pradesh) ఓ ఫార్యాస్యూటికల్ కంపెనీ(pharmaceutical company) మాత్రం తప్పేనంటోంది. గడ్డం, మీసాలతో డ్యూటీకి వచ్చిన 80 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగంలోంచి తొలగించింది. సంస్థలో పనిచేసేవారంతా క్లీన్ షేవ్‌తో(clean shave) రావాలని ఆదేశాలు జారీ చేసింది. సోలన్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన పర్వానూలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గడ్డం, మీసాలు ఉన్నందుకు ఓ కంపెనీ 80 మంది కార్మికులను విధుల నుంచి తొలగిచింది. తర్వాత వారు క్లీన్ షేవ్‌తో కంపెనీకి వచ్చారు. అయినప్పటికీ వారిని తిరిగి ఉద్యోగంలో తీసుకునేందుకు సదరు కంపెనీ నిరాకరించింది. వారు పరిశ్రమలోకి రాకుండా అడ్డుకుంది. దీంతో కార్మికులంతా నిరసన చేపట్టారు. లేబర్ కమిషనర్‌తో పాటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. తర్వాత లేబర్ ఇన్‌స్పెక్టర్ లలిత్ ఠాకూర్ కంపెనీని సందర్శించి ఇరు వర్గాల
వాదనలు విన్నారు. ఈ ఘటనపై డీసీ సోలన్ మన్మోహన్ శర్మకు వివరించారు. పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు జరిగితే నిబంధనల ప్రకారం పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని మన్మోహన్ శర్మ హెచ్చరించారు.
