ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టులకు న్యాయాధికారుల బదిలీకి ఇకపై సుప్రీంకోర్టు అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం తన మునుపటి ఉత్తర్వులను సవరించింది. ఇలాంటి పరిపాలనా నిర్ణయాల కోసం సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకుంటే సరిపోతుందని వెల్ల‌డించింది.

ఎంపీ(MP)లు, ఎమ్మెల్యే(MLA)ల కేసుల(Cases)ను విచారించే ప్రత్యేక కోర్టు(Special Courts)లకు న్యాయాధికారుల(Presiding Officers) బదిలీ(Transfers)కి ఇకపై సుప్రీంకోర్టు(Supreme Court) అనుమతి అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం తన మునుపటి ఉత్తర్వులను సవరించింది. ఇలాంటి పరిపాలనా నిర్ణయాల కోసం సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(High Court Chief Justice) అనుమతి(Permission) తీసుకుంటే సరిపోతుందని వెల్ల‌డించింది. ఈ విషయమై సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 10, 2021, అక్టోబర్ 10 నిర్ణయాలను సవరించింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక కోర్టులు లేదా సీబీఐ(CBI) కోర్టుల జ్యుడీషియల్ అధికారులందరూ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రస్తుత పదవుల్లోనే కొనసాగాలని సుప్రీంకోర్టు ఆగస్టు(August) 2021 ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌(October)లో, జ్యుడీషియల్ అధికారుల బదిలీకి హైకోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated On 11 July 2023 9:42 PM GMT
Yagnik

Yagnik

Next Story