కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections) దగ్గరపడ్డాయి. రాజకీయపార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలలో నిమగ్నమయ్యాయి. సర్వే సంస్థలు కూడా బిజీ అయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)కి స్వల్ప ఆధిక్యత ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇప్పటి వరకు సర్వే నివేదికలు చెప్పాయి. అంతే పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ మాత్రం ఈసారి కూడా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని గట్టిగా చెబుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 113 స్థానాలు ఏ పార్టీకి లభించడం లేదని తెలిపింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Assembly Elections) దగ్గరపడ్డాయి. రాజకీయపార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలలో నిమగ్నమయ్యాయి. సర్వే సంస్థలు కూడా బిజీ అయ్యాయి. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)కి స్వల్ప ఆధిక్యత ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఇప్పటి వరకు సర్వే నివేదికలు చెప్పాయి. అంతే పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌(People's Pulse Survey) సంస్థ మాత్రం ఈసారి కూడా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందని గట్టిగా చెబుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 113 స్థానాలు ఏ పార్టీకి లభించడం లేదని తెలిపింది. సౌత్‌ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తకరమైన అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 10 వరకు నిర్వహించిన ఈ సర్వేలో కర్ణాకటలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని స్పష్టమయ్యింది. కాకపోతే హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌పార్టీకి కొంచెం ఆధిక్యత కనిపిస్తోంది. భారత్‌ జోడో యాత్ర ప్రభావంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ మెజారిటీ సాధిస్తుందని ప్రచారం జరిగినా, అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదని సర్వే నివేదిక చెబుతోంది.

‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్‌ మెథడాలజీ’ (పీపీఎస్‌) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో అయిదు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 20 శాంపిల్స్‌ తీసుకున్నారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, స్త్రీలు, పేదలు, సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 5600 శాంపిల్స్‌ సేకరించారు. ఈ సర్వేలో కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో కొంత మొగ్గు కనిపించింది. కాంగ్రెస్‌ పార్టీ 98 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచే అవకాశాలున్నాయి. సర్వేలో ఆ పార్టీకి 95-105 స్థానాలు వస్తాయని తేలింది. బీజేపీకి 92 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. జేడీ (ఎస్‌) 27 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందట. ఆ లెక్కన ఈ పార్టీ మరోసారి కింగ్‌మేకర్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. జేడీ(ఎస్‌)కు 25 నుంచి 30 సీట్లు రావచ్చు. అంటే 2018 ఎన్నికల ఫలితాల్లాగే ఈసారి కూడా హంగ్‌ రావచ్చన్నమాట. గాలి జనార్దన్‌రెడ్డి నాయకత్వంలో కొత్తగా పుట్టిన కేఆర్‌పీపీ పార్టీ పెద్దగా ప్రభావం చూపడం లేదు. మహా అయితే ఆ పార్టీ ఒకటి రెండు సీట్లు రావచ్చట. ఎస్‌డీపీఐ, మజ్లిస్‌లకు ఒక్క సీటు కూడా వచ్చేలా లేదు. కాకపోతే మజ్లిస్‌ పార్టీ కాంగ్రెస్‌ అవకాశాలను స్వల్పంగా దెబ్బతీయవచ్చు. ఇక ఆప్‌ పార్టీ ప్రభావం స్వలంగా ఉన్నా సీట్లు గెల్చుకునేంత సీన్‌ ఆ పార్టీకి లేదట. మరోవైపు ఈ సర్వేలో సుమారు నాలుగు శాతం మంది రాబోయే ప్రభుత్వం గురించి తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ఇష్టపడలేదు.

ఓవరాల్‌గా ఈ ఎన్నికల్లో తటస్థుల పాత్ర కీలకం కాబోతుంది. 1985 నుంచి కర్ణాటకలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదీ లేదు. అంటే ప్రభుత్వ మార్పు తప్పనిసరి కావచ్చు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీకి 2018 ఎన్నికలతో పోలిస్తే 2.86 శాతం ఓట్లు అధికంగా వస్తాయి. 2018లో 38.14 శాతం ఓట్లు పొందిన కాంగ్రెస్‌కు ఇప్పుడు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో అధికార పక్షం బీజేపీకి ఓట్ల శాతం తగ్గుతోంది. 2018లో 36.35 శాతం సాధించిన బీజేపీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుందని సర్వేలో తేలింది. జేడీ (ఎస్‌) కూడా ఓట్ల శాతాన్ని స్వల్పంగా కోల్పోతున్నది. 2018 కంటే 2.3 శాతం ఓట్లు తక్కువ రావచ్చు. ఆ లెక్కన గత ఎన్నికల్లో 37 సీట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 27 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుందని పీపుల్స్‌ పల్స్‌ అడిగిన ప్రశ్నకు 32 శాతం మంది సిద్ధరామయ్య అయితే బెటర్‌ అని జవాబిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి బి.యడియురప్పకు 25 శాతం మంది జై కొట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకి 20 శాతం మద్దతివ్వగా, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 18 శాతం, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌కు అయిదు శాతం మంది బాసటగా నిలిచారు. కర్ణాటక రాష్ట్రం ఎవరి సారథ్యంలో అభివృద్ధి చెందుతుందన్న ప్రశ్నకు 42 శాతం మంది కాంగ్రెస్‌ అని అన్నారు. 38 శాతం మంది బీజేపీ కి ఓటేశారు. 14 శాతం మంది జేడీ (ఎస్‌) అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వం రావచ్చన్న ప్రశ్నకు 26 శాతం మంది కాంగ్రెస్‌ అన్నారు. 24 శాతం మంది బీజేపీ అన్నారు. 15 శాతం మంది జేడీ(ఎస్‌) అని జవాబిచ్చారు. బీజేపీకి మళ్లీ చాన్సిస్తారా అన్న ప్రశ్నకు 51 మంది ఇవ్వమని చెప్పేశారు. 43 శాతం మంది ఇస్తామన్నారు. ఆరు శాతం మంది ఎటూ చెప్పలేకపోయారు. ఒకవేళ హంగ్‌ ఏర్పడితే, ఏ సంకీర్ణ ప్రభుత్వమైతే బాగుంటుందన్న దానికి కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) కూటమి బాగుంటుందని 46 శాతం మంది అన్నారు. 41 శాతం మంది బీజేపీ-జేడీ (ఎస్‌) కూటమిగా ఏర్పడాలని అన్నారు.

ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌ పక్షంవైపు నిలబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కొంత కాంగ్రెస్‌కు తోడవనుంది. కళ్యాణ్‌ కర్ణాటక కాంగ్రెస్‌కు సురక్షిత ప్రాంతంలా ఉండగా, ముంబాయి కర్ణాటక ప్రాంతంలో ఆ పార్టీకి కొంత కష్టంగా ఉంది. మధ్య కర్ణాటక, బెంగుళూరు ప్రాంతాలలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య నువ్వా నేనా అనే పోటీ నెలకొని ఉంది. పాత మైసూరు, కోస్తా ప్రాంతాలు బీజేపీకి ప్రతికూలంగా ఉన్నాయి. పాత మైసూరులో జేడీ (ఎస్‌) కాంగ్రెస్‌ మధ్య పోటాపోటీ ఉంది. ఇక్కడ జేడీ (ఎస్‌) కాస్త పైచేయిగా ఉంది. కోస్తా ప్రాంతంలో కాంగ్రెస్‌- బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ ఉంది.

Updated On 13 April 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story