ఒక్క ఓటుతో గెల్చినా, లక్ష ఓట్లతో గెలిచినా గెలుపు గెలుపే! కానీ చెప్పకోవడానికి రెండోది బాగుంటుంది.. భారీ మెజారిటీతో గెలిచామనుకోండి. ఆ సంబరమే వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఘనత ప్రీతమ్‌ ముండేకు(Preetham munde) దక్కుతుంది. బీజేపీ(BJP) నాయకురాలైన ఈమె 2014లో జరిగిన ఉప ఎన్నికలో రికార్డు సృష్టించారు. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర బీద్‌ ఎంపీ గోపీనాథ్‌ ముండే(Gopinath munde) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివవార్యమయ్యింది. దాంతో ఆయన కూతురు ప్రీతమ్‌ బీద్‌ నుంచి పోటీ చేశారు.

ఒక్క ఓటుతో గెల్చినా, లక్ష ఓట్లతో గెలిచినా గెలుపు గెలుపే! కానీ చెప్పకోవడానికి రెండోది బాగుంటుంది.. భారీ మెజారిటీతో గెలిచామనుకోండి. ఆ సంబరమే వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఘనత ప్రీతమ్‌ ముండేకు(Preetham munde) దక్కుతుంది. బీజేపీ(BJP) నాయకురాలైన ఈమె 2014లో జరిగిన ఉప ఎన్నికలో రికార్డు సృష్టించారు. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర బీద్‌ ఎంపీ గోపీనాథ్‌ ముండే(Gopinath munde) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివవార్యమయ్యింది. దాంతో ఆయన కూతురు ప్రీతమ్‌ బీద్‌ నుంచి పోటీ చేశారు. ఆమె 6.96 లక్షల ఓట్ల తేడాతో ప్రత్యర్థిని ఓడించారు. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు ఆరు లక్షల ఓట్ల కటే ఎక్కువ మెజారిటీతో గెలిచారు. ఈ నలుగురూ భారతీయ జనతాపార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. గుజరాత్‌లోని నవసరిలో బీజేపీ నాయకుడు సీ.ఆర్‌.పాటిల్‌ 6.89 లక్షల మెజారిటీతో ప్రత్యర్థిని ఓడించారు.

హర్యానాలోని కర్నాల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సజయ్‌ భాటియా(Sanjay Bhatia) 6.56 లక్షల మెజారిటీతో గెలుపొందితే, ఫరీదాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్‌ గుజ్జర్‌ 6.38 లక్షల మెజారిటీతో విజయం సాధించారు.రాజస్థాన్‌లోని భిల్వాడా నియోజకవర్గంలో సుభాష్‌ బహేరియా 6.12 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో బెంగాల్‌లోని ఆరంబాఘ్‌ నుంచి పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి అనిల్ బసు 5.92 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఇప్పుడు స్వల్ప తేడాతో గెలిచిన వారి గురించి కూడా తెలుసుకుందాం!
1989లో జరిగిన ఎన్నికల్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసిన కొణతాల రామకృష్ణ(Konathala Ramakrishna) కేవలం 9 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1998లో బిహార్‌లోని రాజ్‌మహల్‌ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సోమ్‌ మరండి కూడా కేవలం 9 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
1996లో గుజరాత్‌లోని బరోడా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ నేత గైక్వాడ్‌ సత్యజీత్‌ సిన్హా తన ప్రత్యర్థిపై 17 ఓట్ల తేడాతో నెగ్గారు. 1971లో తమిళనాడులోని తిరుచెందూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి ఎంఎస్‌ శివస్వామికి 26 ఓట్ల తేడాతో విజయం వరించింది. ఇక 2014లో లద్దాఖ్‌ స్థానం నుంచి బీజేపీ నేత తుప్‌స్తన్‌ చెవాంగ్‌ 36 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

1962లో ఔటర్‌ మణిపుర్‌ స్థానం నుంచి రిషాంగ్‌ (మణిపుర్‌ ఆఫ్‌ సోషలిస్ట్‌ పార్టీ) 42 ఓట్లు,
2004లో లక్షద్వీప్‌ నుంచి పోకున్హికోయ 71 ఓట్లు, 1980లో ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా నుంచి ఇందిరా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రామాయణ్‌ రాయ్‌ 77 ఓట్ల తేడాతో గెలుపొందారు.పోలైన ఓట్లలో దాదాపు 90శాతం, అంతకంటే ఎక్కువే సంపాదించుకున్నవారు కూడా ఉన్నారు. 1989లో జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ స్థానం నుంచి జమ్మూకశ్మీర్‌ నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీ తరపున బరిలో దిగిపన పీఎల్‌ హండూకు ఏకంగా 98శాతం ఓట్లు పోలయ్యాయి. అప్పట్లో ఈ స్థానంలో 7.36లక్షల ఓటర్లుండగా.. కేవలం అయిదు శాతం మంది అంటే 37,377 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 36,055 మంది హండూనే ఎన్నుకొన్నారు. నాడు ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి ప్రత్యర్థులెవరూ లేకపోవడంతో మెజారిటీ విజయం దక్కింది. ఇక, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1991లో నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 89.5శాతం ఓటు షేరు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో అయిదు లక్షల మెజారిటీతో విజయం సాధించి గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టలేదు. లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నేత రామ్‌ విలాస్‌ పాసవాన్‌.. 1977లో జరిగిన ఎన్నికల్లో బిహార్‌లోని హజీపుర్‌ నుంచి 89శాతం ఓట్లు సాధించారు. మెజారిటీ 4,24,000 కావడం విశేషం.

Updated On 3 Jun 2024 6:21 AM GMT
Ehatv

Ehatv

Next Story