ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) మేరఠ్‌ జిల్లా గగోల్‌(Gagol) గ్రామ ప్రజలు దసరా(Dasara Festival) పండుగను అసలు జరుపుకోరు. అసలు ఆరోజున ఎవరి మోములో ఆనందం కనబడదు. దేశమంతటా దసరాను సరదాగా జరుపుకుంటే ఆ ఊరి ప్రజలు మాత్రం అమర వీరులను స్మరించుకుంటూ సంతాపం ప్రకటిస్తారు. ఇది 166 ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది.

1857లో బ్రిటిష్‌వారికి(Brittish) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తిరుగుబాట్లు జరిగాయి. తెల్లదొరలపై జరిపిన పోరాటాన్ని మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా చెప్పుకుంటుంటాము. చాలామంది పోరాటయోధులను బ్రిటిష్‌ ప్రభుత్వం జైలులో పెట్టింది. గగోల్‌, దాని పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి ధన్‌ సింగ్‌ నేతృత్వంలో మేరఠ్‌ జైలుపై దాడి చేసి బందీలను విడిపించారు. తర్వాత ఆంగ్లేయులు కసిని పెంచుకున్నారు. తిరుగుబాటును క్రూరంగా అణచివేశారు. ఎంతోమందిని చంపేశారు. ప్రజలను భయకంపితులను చేయాలనే ఉద్దేశంతో తొమ్మిది మంది విప్లవకారులను బంధించి విజయదశమి రోజున గగోల్‌లోని రావి చెట్టుకు ఉరి తీశారు. ఆ విషాద ఘటన ఆ గ్రామ ప్రజలపై చెరగని ముద్ర వేసింది. అప్పటి నుంచి గగోల్‌ ప్రజలు దసరా పండుగకు దూరంగా ఉంటున్నారు.

Updated On 25 Oct 2023 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story