దేశం యావత్తూ సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన మణిపూర్‌లో(Manipur) జరిగింది. ఇద్దరు మహిళలను నగ్నంగా(Nude) మార్చి, ఆపై జరిగిన రాక్షస క్రీడపై సభ్య సమాజం రగిలిపోతున్నది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పాశవిక సంఘటనపై దేశంలో నిరనసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.
దేశం యావత్తూ సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన మణిపూర్‌లో(Manipur) జరిగింది. ఇద్దరు మహిళలను నగ్నంగా(Nude) మార్చి, ఆపై జరిగిన రాక్షస క్రీడపై సభ్య సమాజం రగిలిపోతున్నది. ఈ అమానవీయ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పాశవిక సంఘటనపై దేశంలో నిరనసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్‌సింగ్ ఇంటిని ఓ మూక తగలబెట్టింది. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్(Huro Das) ఇంటిని కొందరు గ్రామస్తులు చుట్టుముట్టారు. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్టు నినాదాలు చేశారు. ఆ ఊళ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు కాపు కాస్తున్నాయ. మణిపూర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడిని వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించిన ఆ వ్యక్తి హుయిరేమ్(Huirem). అప్పటికే వీడియో వైరల్ కావడంతో భయంతో కుటుంబాన్ని మరో చోటకు తరలించాడు. తాను మాత్రం మరో చోట తలదాచుకున్నాడు. బుధవారం రాత్రి పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ధౌబల్ జిల్లాను జల్లెడపట్టారు. అతగాడిని దొరకపుచ్చుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మూడు నెలలుగా మణిపూర్ మండిపోతున్నది.
తమకు గిరిజన హోదా కావాలన్న మెయితీల డిమాండ్‌ను కుకీ తెగ వ్యతిరేకిస్తోంది. తర్వాత రెండు జాతుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఈ సమయంలోనే ఓ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసి మెయితీ వర్గం రగిలిపోయింది. కుకీ ప్రజలపై దాడులకు దిగింది. ఈ క్రమంలోనే మే 4వ తేదీన బి ఫైనోమ్ గ్రామంలో బీభత్సం సృష్టించారు మెయితీ వర్గం వారు. సుమారు 800 మంది కర్రలు, ఆయుధాలతో కుకీలపై విరుచుకుపడ్డారు. అడ్డం వచ్చిన వారిని చంపేశారు. కుకీ గిరిజనవర్గానికి చెందిన ఇద్దరు మహిళలను పోలీసుల నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. వారిని నగ్నంగా ఊరేగించారు. అడ్డుకోవాలని ప్రయత్నించిని బాధితురాలి తండ్రి, సోదరుడిని దారుణంగా చంపేశారు. ఆపై ఆ మహిళలిద్దరినీ నగ్నంగా ఊరేగించి.. సామూహిక లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. మణిపూర్ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇటీవల కొన్నిచోట్ల ఇంటర్నెట్ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఈ హేయమైన వీడియో బయటకు వచ్చింది. కేవలం 26 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియో దేవం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ ఘటనపై సెకండ్ల పాటే రియాక్టవ్వడం గమనార్హం.