రాయి రప్ప, చెట్టు పుట్ట ఇలా సమస్తాన్ని దైవంగా భావించి పూజలు చేయడం హైందవ సంస్కృతిలో(Hindu Tradition) భాగం. ఇలాగే మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) కొన్ని వందల ఏళ్ల నుంచి ఓ కుటుంబం కొన్ని రాళ్ల బంతులను(Stone balls) కులదేవతగా(Godess) తలచి నిత్యం కొలుస్తోంది. అసలు అవి రాళ్లో కావో కూడా వారికి తెలియదు. తాజాగా వాటిని పరిశీలించిన సైంటిస్టులు అవి లక్షల ఏళ్ల కిందటి డైనోసార్ల గుడ్లు(Dinosaur eggs) అని కనిపెట్టారు. ఈ ముక్క చెప్పేసరికి ఆ కుటుంబం బిత్తరపోయింది! ధార్ జిల్లా పడ్లాయా గ్రామంలో ఉన్న మండోలయ్ కుటుంబమే కులదేవత పేరుతో గుడ్లను పూజిస్తూ వచ్చింది.
రాయి రప్ప, చెట్టు పుట్ట ఇలా సమస్తాన్ని దైవంగా భావించి పూజలు చేయడం హైందవ సంస్కృతిలో(Hindu Tradition) భాగం. ఇలాగే మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) కొన్ని వందల ఏళ్ల నుంచి ఓ కుటుంబం కొన్ని రాళ్ల బంతులను(Stone balls) కులదేవతగా(Godess) తలచి నిత్యం కొలుస్తోంది. అసలు అవి రాళ్లో కావో కూడా వారికి తెలియదు. తాజాగా వాటిని పరిశీలించిన సైంటిస్టులు అవి లక్షల ఏళ్ల కిందటి డైనోసార్ల గుడ్లు(Dinosaur eggs) అని కనిపెట్టారు. ఈ ముక్క చెప్పేసరికి ఆ కుటుంబం బిత్తరపోయింది! ధార్ జిల్లా పడ్లాయా గ్రామంలో ఉన్న మండోలయ్ కుటుంబమే కులదేవత పేరుతో గుడ్లను పూజిస్తూ వచ్చింది. ఒక్కొక్కటి అరచేతిలో పట్టేంత పరిమాణంలో గుండ్రాయిలా ఉన్నాయి. ఇలాంటి రాళ్ల బంతులు సుమారు తొమ్మిందింటిని కాకర్ భైరవ్(Kakar Bhairav) పేరుతో పూజిస్తున్నామని వెస్టా మండోలయ్ తెలిపారు. ఈ దేవత కారణంగానే తమ పంట పొలాలు, పశు సంపదకు ఎలాంటి కీడు రావడం లేదని, ఆ దేవతే రక్షిస్తోందని అంటున్నారామె! ఒక్క మండోలయ్ కుటుంబమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలోని కొన్ని కుటుంబాలు కాకర్ భైరవ్ పేరుతో ఇలాంటి గుండ్రాయిలను పూజిస్తున్నారట! కొన్ని రోజుల కిందట ఈ గుడ్ల ఫోటోలను చూసిన శాస్త్రవేత్తలకు అనుమానం కలిగింది. వాటిని పరిశీలించాలని అనుకున్నారు. లక్నో(Lucknow) సాహ్నీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్(Sawhney Institute of Paleosciences) విభాగం పరిశోధకులు వెంటనే వచ్చేశారు. దైవంగా పిల్చుకుంటున్న గుండ్రటి రాళ్లను పరిశోధించారు. చివరకు అవి డైనోసార్ గుడ్లని తేలింది. ఆ గుడ్లు టైటనోసారస్(Titanosaurus) అనే జాతికి చెందిన రాక్షస బల్లుల(Lizard) వట! సుమారు ఏడు కోట్ల సంవత్సరాల కిందట ఈ టైటనోసారస్‌లు భూమి మీద మనుగడ సాగించాయని అంటున్నారు. భూమ్మీద జీవించిన అతి పెద్ద రాక్షసబల్లులలో టైటనోసారస్ ఒకటి. మధ్య ప్రదేశ్ చుట్టుపక్కల నర్మదా నదీ(Narmada river) పరివాహక ప్రాంతంలో అప్పుడవి విరివిగా సంచరించాయట!