కేరళలోని(Kerala) కాసరగోడ్(Kasaragod) జిల్లాలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ(Ananta Padmanabhaswamy Temple) విశిష్టత ఏమిటో చాలా మందికి తెలుసు! ఆ ఆలయం సరస్సులోనే ఉంది. ఆ సరస్సులోనే బబియా(Babiya) అనే శాకాహార(Vegetarian) మొసలి(Crocodile) ఉండేది. అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలహారాలు తప్ప మరోటి ముట్టుకునేది కాదు. దశాబ్దాలుగా ఆ సరస్సులో ఉన్న బబియా గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన చనిపోయింది.
కేరళలోని(Kerala) కాసరగోడ్(Kasaragod) జిల్లాలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ(Ananta Padmanabhaswamy Temple) విశిష్టత ఏమిటో చాలా మందికి తెలుసు! ఆ ఆలయం సరస్సులోనే ఉంది. ఆ సరస్సులోనే బబియా(Babiya) అనే శాకాహార(Vegetarian) మొసలి(Crocodile) ఉండేది. అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలహారాలు తప్ప మరోటి ముట్టుకునేది కాదు. దశాబ్దాలుగా ఆ సరస్సులో ఉన్న బబియా గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన చనిపోయింది. చిత్రమేమిటంటే చనిపోయిన బబియా స్థానంలో మరో కొత్త మొసలి అక్కడ కనిపించడం ! ఇదే ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది.నాలుగు రోజుల కిందట అదే తటాకంలో ఓ మొసలి కనిపించింది. నవంబర్ 8వ తేదీన సరస్సు వెంబడి ఉన్న ఓ గుహలో ఈ కొత్త మొసలిని గుర్తించారు భక్తులు. విషయాన్ని అధికారుల చెవిన వేశారు. వారు కూడా శనివారం మొసలిని గుర్తించారు. ఆలయ పూజారికి మొసలి గురించి చెప్పారు. ఆలయ పూజారి(Priest) ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనిపించడమన్నది అక్కడ అనివార్యంగా జరుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందన్నది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆ సరస్సులో ఇంతకు ముందు చనిపోయిన బబియా అనే మొసలి మూడోదని అంటున్నారు. చనిపోయినప్పుడు దాని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు. అప్పట్లో ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదట! బ్రిటిష్ వారు దాన్ని కాల్చి చంపేశారట! అది చనిపోయిన నాలుగైదు రోజులకు ఆ సరస్సులో మరో మొసలి ప్రత్యక్షమయ్యిందని స్థానికులు చెబుతున్నారు. అది కూడా చనిపోయిన తర్వాత బబియా వచ్చింది. బబియా పూర్తిగా శాకాహారి. ఆలయ పూజారి పెట్టే ప్రసాదాన్ని ఇష్టంగా తినేది. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టేది కాదు. సరస్సులోని చేపలను కూడా ముట్టేది కాదు. అంతటి సాధుజీవి అది! ఈ మొసలికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో ఎవరికీ తెలియదు. బబియా అంత్యక్రియలకు జనం పెద్దపెట్టున వచ్చారు. కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయ నాయకులు రావడం విశేషం. ఇప్పుడా స్థానంలో మరో మురళి రావడం ఆందరనీ ఆశ్చర్యచకితులను చేసింది. మరో విచిత్రమేమిటంటే ఆ ఆలయం సమీపంలో నది కాని, చెరువు కాని లేదు. మరి ఆ కోనేరులోనే మొసలి ఎలా వచ్చిందన్నది అంతుపట్టని మిస్టరీ!