రాష్ట్రాలు కొత్త చట్టాలను సవరించవచ్చు
మూడు కొత్త క్రిమినల్ చట్టాలకు(Criminal law) నిర్దిష్ట సవరణలను సూచించేందుకు కమిటీని నియమించాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్(congress) నేత పి.చిదంబరం(P Chidhambaram) మంగళవారం స్వాగతించారు. క్రిమినల్ చట్టం అనేది రాజ్యాంగం యొక్క ఉమ్మడి జాబితాలోని అంశం అని.. ఇది కొత్త చట్టాలను సవరించడానికి రాష్ట్రాలను అనుమతినిస్తుందన్నారు.
"ఈ ఏడాది జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన మూడు క్రిమినల్ చట్టాలకు రాష్ట్రంలో సవరణలను సూచించడానికి ఒక కమిటీని నియమించాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను" అని X లో పేర్కొన్నారు. 'క్రిమినల్ చట్టం అనేది రాజ్యాంగం యొక్క ఉమ్మడి జాబితాలోని అంశం.. కొత్త చట్టాన్ని సవరించడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఉంది' అని అన్నారు. 'నేను జస్టిస్ (రిటైర్డ్) కె. సత్యనారాయణన్‌ను ఏక సభ్య కమిటీగా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను. న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు, న్యాయ ఉపాధ్యాయులు, పండితులు, మానవ హక్కుల కార్యకర్తలతో సహా అందరినీ సంప్రదించాలని నేను కమిటీని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కొత్త క్రిమినల్ చట్టాలలో సవరణలను సిఫారసు చేయడానికి సోమవారం మొదటి అడుగు వేశారు. మూడు చట్టాలను అధ్యయనం చేసి.. వాటికి సవరణలను సిఫారసు చేసేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
కేంద్ర చట్టాల సవరణలపై చర్చించేందుకు రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించిన స్టాలిన్.. మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎం. సత్యనారాయణన్‌తో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.