ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై(CM Jagan) వ్యక్తిగత కక్ష పెట్టకుని, దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చెల్లెలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. జగన్‌ పరిపాలనను తిట్టిపోస్తున్నారు. ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ గెలవడం కంటే జగన్ ఓడిపోవడమే ముఖ్యమయ్యింది. ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఆ పార్టీకి చెందిన వారంతా గత్యంతరం లేక కాంగ్రెస్‌లో(Congress) చేరిపోతారని, అలా 2029 నాటికి ఆ పార్టీని బలోపేతం చేయవచ్చని షర్మిల అనుకుంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై(CM Jagan) వ్యక్తిగత కక్ష పెట్టకుని, దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చెల్లెలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. జగన్‌ పరిపాలనను తిట్టిపోస్తున్నారు. ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ గెలవడం కంటే జగన్ ఓడిపోవడమే ముఖ్యమయ్యింది. ఒకవేళ వైసీపీ ఓడిపోతే ఆ పార్టీకి చెందిన వారంతా గత్యంతరం లేక కాంగ్రెస్‌లో(Congress) చేరిపోతారని, అలా 2029 నాటికి ఆ పార్టీని బలోపేతం చేయవచ్చని షర్మిల అనుకుంటున్నారు. అలా కాని పక్షంలో తెలంగాణలో ఎలా అయితే పాలిటిక్స్‌ నుంచి పక్కకు జరిగారో ఏపీలో కూడా అలాగే అవుతుంది. ఈ విషయం షర్మిలకు కూడా తెలుసు. అందుకే పీసీసీ(PCC) పది దొరకగానే వైసీపీపై ధాటిగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2వ తేదీన ఢిల్లీలో ప్రత్యేక హోదా డిమాండ్‌తో షర్మిల ఒక రోజు నిరసన దీక్షను చేపడుతున్నారు. అటు పిమ్మట ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు వివిధ జిల్లాలో సభలు, రోడ్‌ షోలను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరులో ఓ పెద్ద సభను ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే రోజున సీఎం జగన్‌ విశాఖ పర్యటన ఉంది. ఆడుదాం ఆంధ్రా పేరిట ఏపీలో మూడు నెలలుగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు కార్యక్రమం విశాఖలోనే జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి జగన్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఆ రోజు ఆయన విశాఖలోనే ఉంటారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను జగన్‌ ప్రారంభిస్తారు. ఆ రోజున అన్నాచెల్లెళ్లు ఇద్దరూ విశాఖలోనే ఉంటారు. వేరు వేరు సభలలో పాల్గొంటారు. అంటే ఆ రోజున అన్నాచెల్లెళ్లు సవాళ్లు విసురుకునే అవకాశం ఉందన్నమాట! చూద్దాం ఆ రోజున ఏం జరుగుతుందో!

Updated On 1 Feb 2024 8:10 AM GMT
Ehatv

Ehatv

Next Story