రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా(Reserve Bank India) ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎంకు(Paytm) కష్టాలు మొదలయ్యాయి. ఈ సంస్థ షేర్‌ విలువ రెండు రోజుల్లోనే 15 శాతం పడిపోయింది. చాలా మందికి పేటీఎం భవిష్యత్తు ఏమిటన్నది అనుమానంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈపాటికే కొందరు వేరే అవకాశాలను వెతుక్కుంటున్నారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా(Reserve Bank India) ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎంకు(Paytm) కష్టాలు మొదలయ్యాయి. ఈ సంస్థ షేర్‌ విలువ రెండు రోజుల్లోనే 15 శాతం పడిపోయింది. చాలా మందికి పేటీఎం భవిష్యత్తు ఏమిటన్నది అనుమానంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈపాటికే కొందరు వేరే అవకాశాలను వెతుక్కుంటున్నారు. డిజిటల్ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లలో స్వల్పకాలంలోనే అతి పెద్ద సంస్థగా ఎదిగింది పేటీఎం. పెద్ద పెద్ద జీతాలిచ్చి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. సంస్థ మనుగడపై సందేహాలు వస్తుండటంతో టైమ్‌కు జీతం పడుతుందో లేదోనని ఉద్యోగులు అనుకుంటున్నారు. ఈ సంక్షోభ సమయంలో వేరే కంపెనీలో జాబ్‌ వెతుక్కోవడమే మంచిదనే నిర్ణయానికి కొందరు వచ్చారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్‌లపై(Startup Company) దృష్టి పెట్టారు. అయితే వారి జీతాలే వారికి పెద్ద సమస్యగా మారాయి. రిక్రూట్‌మెంట్ సర్వీసెస్, జాబ్‌ సెర్చ్ సంస్థల చెబుతున్నదాని ప్రకారం పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20 నుంచి 30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పడదే పేటీఎం ఉద్యోగులకు శాపంగా మారింది. అంతేసి జీతాలు ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకోవడానికి చాలా స్టార్టప్‌ కంపెనీలు వెనుకాడుతున్నాయి. చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైనా పర్వాలేదని, ఉద్యోగం ఉంటే చాలని అనుకుంటున్నారు. ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఎలాంటి కస్టమర్‌ ఖాతాలు, ప్రీపెయిడ్‌ సాధనాలు, వాలెట్లు, కార్డులపై తదుపరి డిజాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్‌-అప్‌లను నిర్వహించవద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించిన విషయం తెలిసిందే!

Updated On 10 Feb 2024 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story