అత్యంత ప్రతిష్టాకరమైన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) చోటు కోసం సినిమా మేకర్స్‌ తహతహలాడుతుంటారు. ఆ సినిమా మహోత్సవంలో మన సినిమాకు చోటు దక్కక మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నేళ్ల తర్వాత ఇండియన్‌ సినిమాకు అక్కడ గౌరవం లభించింది. పాయల్ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌(All we imagine as light) అనే సినిమాకు కేన్స్‌లో పామ్‌ డి ఓర్‌ అవార్డుకు(Palme d'Or Award) నామినేట్ అయ్యింది.

అత్యంత ప్రతిష్టాకరమైన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) చోటు కోసం సినిమా మేకర్స్‌ తహతహలాడుతుంటారు. ఆ సినిమా మహోత్సవంలో మన సినిమాకు చోటు దక్కక మూడు దశాబ్దాలు దాటింది. ఇన్నేళ్ల తర్వాత ఇండియన్‌ సినిమాకు అక్కడ గౌరవం లభించింది. పాయల్ కపాడియా దర్శకత్వంలో రూపొందిన ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌(All we imagine as light) అనే సినిమాకు కేన్స్‌లో పామ్‌ డి ఓర్‌ అవార్డుకు(Palme d'Or Award) నామినేట్ అయ్యింది. పాయల్‌ కపాడియా(Payal kapadia) దర్శకత్వంలో మొదటి ఫిక్షన్‌ సినిమా ఇది! మే 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగనున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అత్యున్నత పురస్కారాల కోసం ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ పోటీలో నిలిచింది. పామ్‌ డి ఓర్‌ అవార్డు కోసం పోటీ పడుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం ఇదే ! 1994లో షాజీ ఎన్‌ కరుణ్‌ దర్శకత్వంలో వచ్చిన స్వహం సినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికయ్యింది. బ్రిటీష్-ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి చిత్రం సంతోష్ కూడా అన్ సెర్టైన్ రిగార్డ్ విభాగానికి ఎంపికైంది. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమాను ఓ నర్సు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీశారు. గతంలో చేతన్ ఆనంద్, వి. శాంతారామ్, రాజ్ కపూర్, సత్యజిత్ రాయ్‌, ఎం.ఎస్‌.సాత్యు, మృణాల్ సేన్ తీసిన సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికయ్యాయి. పామ్ అవార్డ్‌ గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రంగా నీచా నగర్ నిలిచింది.

Updated On 12 April 2024 2:56 AM GMT
Ehatv

Ehatv

Next Story