ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కౌశాంబి(Kaushambi) జిల్లాలో ఘోరం జరిగింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ అమ్మాయిని నరికి చంపారు(Murder). కొద్ది రోజుల కిందట బెయిల్‌పై(Bail) జైలు నుంచి బయటకు వచ్చిన ఇద్దరు సోదరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పవన్ నిషద్(Pawan Nishad), అశోక్ నిషద్(Ashok Nishad) అనే అన్నదమ్ములు కొద్ది రోజుల కిందట బెయిల్‌పై బయటకు వచ్చారు.

UP Teen Crime
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) కౌశాంబి(Kaushambi) జిల్లాలో ఘోరం జరిగింది. పట్టపగలే అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ అమ్మాయిని నరికి చంపారు(Murder). కొద్ది రోజుల కిందట బెయిల్‌పై(Bail) జైలు నుంచి బయటకు వచ్చిన ఇద్దరు సోదరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. పవన్ నిషద్(Pawan Nishad), అశోక్ నిషద్(Ashok Nishad) అనే అన్నదమ్ములు కొద్ది రోజుల కిందట బెయిల్‌పై బయటకు వచ్చారు. పశువులు కాసుకుని ఇంటికి తిరిగొస్తున్న 19 ఏళ్ల అమ్మాయిని నడిరోడ్డుపై వెంటాడి మరి గొడ్డలితో(Axe) నరికి చంపారు. ప్రాణభయంతో ఆ అమ్మాయి పరుగులు పెడుతున్నా వెంటాడి మరీ చంపారు. అక్కడున్నవారు భయంతో హడలిపోయారు. రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షల కారణంగా వారు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. మూడేళ్ల కిందట ఆ అమ్మాయిపై పవన్ అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలున్నాయ. ఈ కారణంతోనే ఇతడు జైలుకెళ్లాడు. ఆ కేసు వెనక్కి తీసుకోవాలని సోదరులిద్దరూ యువతి కుటుంబాన్ని వేధిస్తున్నారు. బెదిరిస్తున్నారు. అయితే వారు లొంగలేదు. వేరే కేసులో జైలులో ఉంటున్న అశోక్‌తో పాటు పవన్ కూడా ఈ మధ్యనే బెయిల్‌పై బయటకు వ్చారు. రేప్ కేసు(Molestation case) వెనక్కి తీసుకోవాలంటూ అమ్మాయి కుటుంబసభ్యులతో మరోసారి గొడవపడ్డారు నిషద్ సోదరులు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో అమ్మాయిని చంపాలని డిసైడయ్యారు. పశువులు కాసుకుని ఇంటికి వస్తున్న ఆమెను పరుగెత్తించి గొడ్డలితో నరకి చంపేశారు. ప్రస్తుతం నిషద్ సోదరులు పరారీలో ఉన్నారని పోలీసులు అంటున్నారు. అమ్మాయి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. నిందితులను అరెస్ట్ చేయడానికి బృందాలను ఏర్పాటు చేశామని కౌశాంబి పోలీసులు తెలిపారు.
