Pawan kalyan Delhi Tour : పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ సక్సెసవుతుందా? బీజేపీ అధిష్టానం మనసులో ఏముంది?
జనసేన(Janasena) అధినేత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన హస్తినకు ఎందుకు వెళ్లినట్టు? బాబ్బాబు తమ కూటమిలోకి మీరు కూడా వచ్చి చేరండంటూ బీజేపీని(BJP) బతిమాలుకోవడానికా? లేక టీడీపీతో(TDP) తెగదెంపులు చేసుకున్నానని బీజేపీ అధినాయకత్వంతో చెప్పుకోవడానికా? ఈ కన్ఫ్యూజన్ అయితే జనసేన కార్యకర్తలలో ఉంది. చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లు(Nara lokesh) పొత్తు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్ మండిపడుతూ, మమ్మల్ని సంప్రదించకుండా మీరు రెండు సీట్లను ఎలా ప్రకటిస్తారంటూ గట్టిగా ప్రశ్నిస్తూ, బదులుగా తాను కూడా రెండు సీట్లను ప్రకటించేసి ఢిల్లీకి వెళ్లారు పవన్(Pawan kalyan)
జనసేన(Janasena) అధినేత ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన హస్తినకు ఎందుకు వెళ్లినట్టు? బాబ్బాబు తమ కూటమిలోకి మీరు కూడా వచ్చి చేరండంటూ బీజేపీని(BJP) బతిమాలుకోవడానికా? లేక టీడీపీతో(TDP) తెగదెంపులు చేసుకున్నానని బీజేపీ అధినాయకత్వంతో చెప్పుకోవడానికా? ఈ కన్ఫ్యూజన్ అయితే జనసేన కార్యకర్తలలో ఉంది. చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లు(Nara lokesh) పొత్తు ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్ మండిపడుతూ, మమ్మల్ని సంప్రదించకుండా మీరు రెండు సీట్లను ఎలా ప్రకటిస్తారంటూ గట్టిగా ప్రశ్నిస్తూ, బదులుగా తాను కూడా రెండు సీట్లను ప్రకటించేసి ఢిల్లీకి వెళ్లారు పవన్(Pawan kalyan). ఓవైపు ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ, మరోవైపు తెలుగుదేశంపార్టీతో కూడా వపన్ కల్యాణ్ అంటకాగుతూ ఉన్నారన్న విషయం తెలిసిందే.
ఇప్పుడు టీడీపీ-జనసేన కూటమిలోకి మీరు కూడా వస్తే బాగుంటుందని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయవచ్చని బీజేపీ పెద్దలకు చెప్పడానికే పవన్ ఢిల్లీకి వెళ్లారని కొందరు అంటున్నారు. చంద్రబాబు అంటేనే చిర్రెత్తిపోతున్న నరేంద్రమోదీ(Narendra Modi) ఈ ప్రతిపాదనకు ఓకే చెబుతారా? అనుమానమే! చంద్రబాబు ఇప్పటి వరకు అరకు, మండపేట స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పొత్తు ధర్మానికి తూట్లు పొడిచారు. చంద్రబాబు ఎప్పుడూ ఇలాగే చేస్తారన్న విషయం బహుశా పవన్‌కు తెలియకపోవచ్చు. అందుకే పార్టీ కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక, వారిని సంతృప్తిపర్చడం కోసం టీడీపీపై కారాలు మిరియాలు నూరుతున్నట్టు నటించారు పవన్ కల్యాణ్. తాను ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నానని చెప్పుకోవడం కోసం తను కూడా రెండు సీట్లను ప్రకటించారు. టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకున్నాయి కానీ ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు.
మరోవైపు అధికారపక్షం దూకుడుగా వ్యవహరిస్తోంది. దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. టికెట్లు కన్ఫామ్ అయిన అభ్యర్థులు ఆల్‌రెడీ ఆయా నియోజకవర్గాలలో పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేశారు. ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. కూటమి అని చెప్పుకుంటున్నారు కానీ అందులో ఉన్నవి రెండే పార్టీలు. ఆ రెండు పార్టీల మధ్యే ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు ఫైనల్ కాలేదు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది తేలలేదు. తేలలేదనడం కంటే తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయని చెబితే బాగుంటుంది. ఈ నిస్సహాయస్థితికి కారణం బీజేపీ ఇంకా ఓ నిర్ణయానికి రాకపోవడం. అసలు టీడీపీ- జనసేన కూటమిలో కలుస్తుందా లేదా అన్నది తేలలేదు. బీజేపీ కూడా తమతో కలిసి ఎదురే ఉండదన్నది చంద్రబాబు-పవన్‌ల భావన! జగన్ వ్యతిరేక ఓట్లు చీలిపోవమని, విజయం తథ్యమని అనుకుంటున్నారు. బీజేపీ మాత్రం ఎటూ తేల్చడం లేదు. అందుకే సీట్ల పంపిణీలో ఆలస్యం అవుతోంది. ఫలితంగా రెండు పార్టీలలో అసంతృప్తులు పెరుగుతున్నారు. వీటికి పుల్‌స్టాప్ పెట్టాలంటే బీజేపీ నుంచి ఏదో ఒక నిర్ణయం రావాలి. అసలు బీజేపీ ఉద్దేశమేమిటో తెలుసుకోవడానికే పవన్ ఢిల్లీకి వెళ్లారట! ఢిల్లీ టూర్‌ను పవన్ విజయవంతంగా ముగించుకుని వస్తారో, లేక బీజేపీ పెద్దల నుంచి క్లాస్ తీసుకుని వస్తారో చూడాలి.