పాట్నాలోని తన కార్యాలయంలో ఆసియా(Asia) హాస్పిటల్ డైరెక్టర్ సురభి రాజ్(Surabhi Raj) దారుణ హత్యకు గురైన ఘటన

పాట్నాలోని తన కార్యాలయంలో ఆసియా(Asia) హాస్పిటల్ డైరెక్టర్ సురభి రాజ్(Surabhi Raj) దారుణ హత్యకు గురైన ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఆమె భర్త ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని తెలుస్తోంది. ఆసియా హాస్పిటల్ అనే ప్రైవేట్ హాస్పిటల్‌లో కో-డైరెక్టర్‌గా పనిచేసిన సురభి రాజ్‌ను శనివారం మార్చి 22 మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగుడు తన కార్యాలయంలోనే కాల్చి చంపాడు. రాజ్‌పై ఆరుసార్లు కాల్పులు జరిపాడు. ఆమె హత్యకు సంబంధించి మంగళవారం మార్చి 25న ఆమె భర్త రాకేష్ రోషన్(Rakesh roshan), అతని సోదరుడు అతుల్(Athul) సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. "నిందితులలో ఆమె భర్త రాకేష్ రోషన్, అతని తమ్ముడు అతుల్, ముగ్గురు ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు, వారిలో ఒకరు మహిళ కూడా ఉంది.
సురభి రాజ్ ఇటీవల ఆసుపత్రి నిర్వహణలో జోక్యం చేసుకుని కొన్ని ఆర్థిక అవకతవకలను గుర్తించింది. అంతేకాకుండా, ఆసుపత్రిలో HR గా పనిచేస్తున్న 30 ఏళ్ల అల్కాతో తన భర్తకు వివాహేతర సంబందం ఉన్నట్లు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య సంత్సంబధాలు లేవు. అల్కా వివాహం చేసుకున్నప్పటికీ ఆమె భర్త నుండి విడిపోయినట్లు సమాచారం.
ఆసుపత్రి HR అల్కా, రాకేష్ రోషన్ వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు. ఈ విషయంలో గత ఒకటిన్నర నెలలుగా సురభితో రోషన్ వివాదం నడుస్తోంది. 3 రోజుల దర్యాప్తు తర్వాత, రోషన్ సహా 5 మందిని అరెస్టు చేశారు. వారి నార్కో పరీక్ష కూడా జరుగుతుంది. దీనికి కోర్టు నుండి అనుమతి కోరబడుతుంది. వారిని రిమాండ్‌కు తరలించిన తర్వాత వారిని విచారిస్తారు.
"మా దగ్గర తగినంత ఆధారాలు ఉన్నాయి. కానీ కుట్ర గురించి ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. అందువల్ల, ముందుగా, మసూద్‌కు నార్కో పరీక్ష నిర్వహించాలని మేము కోర్టుకు విజ్ఞప్తి చేస్తాము. ఆ రోజు మధ్యాహ్నం 1.30 మరియు 2.15 గంటల మధ్య సురభి హత్యకు గురయ్యారు. హత్య జరిగిన సమయంలో, భర్త సంఘటన స్థలంలో లేడు, కానీ బావమరిది సహా మిగిలిన నలుగురు సంఘటన స్థలంలో ఉన్నారు" అని పోలీసులు తెలిపారు.
