దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవలు 5 రోజుల పాటు బంద్‌లో ఉంటాయి. ఈ మేరకు పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అడ్వైజరీ జారీ చేసింది.

దేశవ్యాప్తంగా పాస్‌పోర్టు సేవలు 5 రోజుల పాటు బంద్‌లో ఉంటాయి. ఈ మేరకు పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అడ్వైజరీ జారీ చేసింది. సాంకేతిక నిర్వహణ కారణంగా పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ఆగస్టు 29 రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 2 ఉదయం వరకు మూసివేయబడుతుందని డిపార్ట్‌మెంట్ తెలిపింది.

దీంతో మీరు కొత్త పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తు చేయాలంటే 5 రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే.. మీరు ఇప్పటికే కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసి ఉంటే.. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 2 మధ్య తేదీని పొందినట్లయితే.. అది కూడా రద్దు చేయబడుతుంది.

ఐదు రోజుల పాటు పాస్‌పోర్టు సేవాలో ఏ పని జరగదు. సేవల మూసివేత ప్రభావం పాస్‌పోర్ట్ సేవా కేంద్రంతో పాటు స్థానిక పాస్‌పోర్ట్ కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖల‌పై ప్ర‌భావం చూప‌నుంది.

భారతదేశంలో మూడు రకాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. బ్లూకవర్ పాస్‌పోర్ట్, మెరూన్ కవర్ పాస్‌పోర్ట్, గ్రేకవర్ పాస్‌పోర్ట్.

బ్లూకవర్ పాస్‌పోర్ట్: ఇది సాధారణ పాస్‌పోర్ట్. ఇది ఏ భారతీయ పౌరునికైనా జారీ చేయబడుతుంది.

మెరూన్ కవర్ పాస్‌పోర్ట్: ఇది దౌత్యపరమైన పాస్‌పోర్ట్. ఇది అధికార దౌత్యవేత్తలు, ప్రభుత్వ పదవులను కలిగి ఉన్న సభ్యుల కోసం భారత ప్రభుత్వంచే జారీ చేయబడుతుంది.

గ్రేకవర్ పాస్‌పోర్ట్: ఇది అధికారిక పాస్‌పోర్ట్. ఇది విదేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారిక అసైన్‌మెంట్‌పై ప్రభుత్వంచే ప్రత్యేకంగా అధికారం పొందిన ఇతర వ్యక్తులకు జారీ చేయబడుతుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story