రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Sessions) ప్రారంభం కానున్నాయి.
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Sessions) ప్రారంభం కానున్నాయి.
ఈ సమావేశాలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) తన ఏడో కేంద్ర బడ్జెట్(Budget 2024)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె రేపు పార్లమెంట్‌లో ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. మర్నాడు అంటే జూలై 23వ తేదీన బడ్జెట్‌ను సమర్పిస్తారు. వరుసగా ఏడు బడ్జెట్‌లు సమర్పించిన రికార్డును నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు. ఇప్పటి వరకు ఈ రికార్డు మోరార్జీ దేశాయ్ పేరిట ఉంది. 1959 నుంచి 1964 వరకు మోరార్జీ దేశాయ్ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. దేశానికి ఆరు బడ్జెట్లు సమర్పించి రికార్డు సృష్టించారు. ఇందులో అయిదు పూర్తి బడ్జెట్లు కాగా ఒకటి మధ్యంతర బడ్జెట్. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కసరత్తులు ప్రారంభించింది. ఫైనాన్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లా, బాయిలర్స్ బిల్లు, కాఫీ, రబ్బరు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.