పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. మరికొద్ది రోజుల్లో పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశం జరగనుంది. సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. సీసీపీఏ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలపై చర్చ జరగనుంది.

సమాచారం ప్రకారం.. 2023 వర్షాకాల సెషన్ జూలై 17 నుండి ప్రారంభమవుతుంది. అగస్టు 10 వరకు సభ కొనసాగే అవకాశం ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతి సంవత్సరం దాదాపు జూలైలో ప్రారంభమవుతాయి. గత ఏడాది 2022లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18న ప్రారంభమయ్యాయి.
ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై మోదీ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కోనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా తిరుగుతూ.. బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుస్తూ ఈ విషయంపై మద్దతు కోరుతున్నారు. బిల్లును వ్యతిరేకించాలని కాంగ్రెస్‌ను కోరారు.. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా తన స్టాండ్‌ను స్పష్టం చేయలేదు. యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని మోదీ తాజా ప్రకటనపై కూడా పార్లమెంటులో దుమారం రేగవచ్చు.
వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్ హౌస్‌లో జరిగే మొదటి సెషన్ ఇదే కావడం విశేషం. వర్షాకాల సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడానికి కొత్త పార్లమెంట్ హౌస్ సిద్ధంగా ఉంది. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద ఈ భవనం నిర్మించబడింది. కొత్త పార్లమెంట్ హౌస్‌లో మంత్రులందరికీ వేర్వేరు కార్యాలయాలు ఉంటాయి. 30 మంది కేబినెట్ మంత్రులు, కొంతమంది రాష్ట్ర మంత్రులకు మాత్రమే పాత భవనంలో కార్యాలయాలు ఉన్నాయి. కొత్త భవనంలో అన్ని రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కూడా ఇవ్వనున్నారు.