పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం వెల్లడించారు. వర్షాకాల సెషన్‌లో చర్చలు సజావుగా సాగేలా మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు ప్రహ్లాద్ జోషి ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని భావిస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Session) జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం వెల్లడించారు. వర్షాకాల సెషన్‌లో చర్చలు సజావుగా సాగేలా మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలకు ప్రహ్లాద్ జోషి ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని భావిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, పార్లమెంటు భవనంలోని కొత్త భవనంలో నిర్వహించవచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 23 రోజుల పాటు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయాలనే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇటీవల లేవనెత్తారు. దీనిపై లా కమిషన్ కూడా అభిప్రాయాన్ని తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశంపై పెద్దఎత్తున దుమారం రేగుతుందని భావిస్తున్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై కూడా చర్చ పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ.. వివిధ పార్టీల మద్దతు కూడగడుతుంది. మణిపూర్‌లో జరుగుతున్న హింసకు సంబంధించి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతాయని భావిస్తున్నారు.