పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూశారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గౌరవార్ధం కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ప్రకాష్ సింగ్ వయస్సు 95 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. మొహాలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా బాదల్ ఆరోగ్యంపై ఆరా తీశారు.

Parkash Singh Badal former Punjab CM and SAD patriarch passes away at 95
పంజాబ్(Punjab) మాజీ సీఎం, శిరోమణి అకాలీదళ్(Shiromani Akali Dal) నేత ప్రకాష్ సింగ్ బాదల్(Parkash Singh Badal) కన్నుమూశారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గౌరవార్ధం కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ప్రకాష్ సింగ్ వయస్సు 95 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. మొహాలి(Mohali)లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారు. గత వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit SHah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కూడా బాదల్ ఆరోగ్యంపై ఆరా తీశారు.
గత సంవత్సరం జూన్ 2022లో కూడా బాదల్ ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారు. కొంతకాలం తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు. మరలా సెప్టెంబర్ 2022న బాదల్ ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరి కోలుకున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ప్రకాష్ సింగ్ బాదల్ చివరిగా 2022 ఎన్నికల్లో పోటీ చేశారు. చరిత్రలో ఆయన తొలిసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వృద్ధ నేతగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ప్రకాష్ సింగ్ బాదల్ 1947లో రాజకీయాల్లోకి వచ్చారు. మొదట సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అతి పిన్న వయసులో సర్పంచ్‌గా ఎన్నికైన నాయకుడిగా గుర్తింపుపొందారు. ప్రకాష్ సింగ్ బాదల్‌ను పద్మవిభూషణ్(Padma Vibhushan) అవార్డు వరించింది.
1957లో తొలిసారిగా ప్రకాశ్ సింగ్ బాదల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 1969లో మళ్లీ గెలిచారు. 1969-70 వరకు పంచాయితీ రాజ్, పశుసంవర్ధక, డెయిరీ తదితర శాఖల మంత్రిగా ఉన్నారు. 1970-71, 1977-80, 1997-2002లో పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాడు. 1972, 1980, 2002లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. మొరార్జీ దేశాయ్(Morarji Desai) ప్రధానిగా ఉన్నసమయంలో బాదల్ పార్లమెంటు సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు.
