నంది తిమ్మన రాసిన ప్రబంధ కావ్యం పారిజాతాపహరణం తెలుసుగా! దేవేంద్రుడి నందనవనంలోంచి నారదుడు పారిజాతాన్ని తెచ్చి శ్రీకృష్ణుడికి ఇస్తాడు. సాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటుగా పారిజాత వృక్షం కూడా వెలికివచ్చిందని అంటారు. ఆ దేవతాపుష్పాన్ని నందకుమారుడు రుక్మిణిదేవికి ఇస్తాడు. అది సత్యభామకు కోపం తెప్పిస్తుంది.
నంది తిమ్మన రాసిన ప్రబంధ కావ్యం పారిజాతాపహరణం తెలుసుగా! దేవేంద్రుడి నందనవనంలోంచి నారదుడు పారిజాతాన్ని తెచ్చి శ్రీకృష్ణుడికి ఇస్తాడు. సాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటుగా పారిజాత వృక్షం కూడా వెలికివచ్చిందని అంటారు. ఆ దేవతాపుష్పాన్ని నందకుమారుడు రుక్మిణిదేవికి ఇస్తాడు. అది సత్యభామకు కోపం తెప్పిస్తుంది. సత్యభామ అలక తీర్చడం కోసం కృష్ణడు దేవతలతో యుద్ధం చేస్తాడు. ఏకంగా పారిజాత వృక్షమే తీసుకొచ్చి సత్యభామకు ఇస్తాడు. టూకీగా ఇదీ కథ! ఇంత పెద్ద కథ నడిచిందంటే పారిజాతం మహిమాన్విత వృక్షమే అయి ఉంటుంది.
మహాభారత కాలం నాటి ఆ పారిజాత వృక్షం(Parijatha vriksham) ఇప్పుడెక్కడ ఉంది? ఆ దివ్య వృక్షానికి ఇప్పటికీ పూలు పూస్తున్నాయా? ఇవి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఓ గ్రామానికి వెళ్లాలి.. అక్కడుందన్నమాట ఈ దేవతా వృక్షం. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి(Barabanki) జిల్లాలో కింతూర్(Kintoor) అనే గ్రామం ఉంది. ఇక్కడే పారిజాత చెట్టు ఉంది. దీనికి స్థిరమైన పేరంటూ ఏమీ లేదు. కొందరు హర్సింగర్(Harsinger) అంటారు. మరికొందరు షెఫాలీ(Shephali) అంటారు. ఇంకొందరు ప్రజక్త(Prajaktha) అంటారు. ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. అన్నట్టు బెంగాల్ రాష్ట్ర పుష్పం(Bengal national flower) కూడా ఇదే! ఇంత పెద్ద ..భారీ పారిజాత వృక్షం మరెక్కడా లేదు. ప్రతి రోజూ రాత్రి ఈ చెట్టుకు చాలా అందమైన రంగురంగుల పూలు పూస్తాయి.
వేకువకాగానే ఆ విరులన్నీ నేలరాలిపోతాయి. ఇతర పూలతో పోలిస్తే పారిజాతం పూలు ప్రత్యేక సమయాల్లోనే పూస్తాయి. దీని వెనుక ఇంద్రుని శాపం ఉందంటారు. సత్యభామ ఈ విరులతో తన కురులను అలంకరించుకునేదట! రుక్మిణీ దేవి ఈ కుసుమాలను పూజలకు ఉపయోగించేదట! ఈ చెట్టును చూసేందుకు సుదూర ప్రాంతల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. పరిమళాలు వెదజల్లే ఆ పూలను చూసి మురిసిపోతుంటారు. ఈ గ్రామం మహాభారత కాలంలో నిర్మితమయ్యిందని గర్వంగా చెప్పుకుంటారు స్థానికులు.
పాండవుల తల్లి అయిన కుంతి(Kunthi) పేరట ఈ గ్రామం ఏర్పడిందని అంటారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ గ్రామంలోనే ఉన్నారట! కుంతీదేవి ప్రతిరోజూ శివుడికి పూజలు చేసేది. తల్లి చేసే ఆ పూజల కోసం అర్జునుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి ఇక్కడకు తీసుకొచ్చారని కొందరు అంటుంటారు. ఇలాంటి పారిజాత వృక్షం దేశంలో ఒక్క కింతూర్ గ్రామంలోనే మాత్రమే కనిపించడం విశేషం. అన్నట్టు ఈ గ్రామంలో కుంతీమాత నెలకొల్పిన కుంతేశ్వరాలయం కూడా ఉంది.