ఓ ఏడేళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్(Blood Cancer) వచ్చింది. బతికించాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. బాలుడు బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. దీంతో దేవుడిపై భారం వేసిన తల్లిదండ్రులు బాలుడిని హరిద్వార్(Haridwar) తీసుకెళ్లారు. అక్కడ పవిత్ర గంగా నదిలో(Ganga river) ముంచితే బాలుడికి క్యాన్సర్ నయమవుతుందని భావించారు. దీంతో గంగా నదిలోకి దిగి ఆ చిన్నారిని నదిలో పదే పదే ముంచారు. ఇలా చాలా సేపు ముంచడంతో ఊపిరాడక బాలుడు ప్రాణాలు వదిలాడు.

వివరాలకు వెళ్తే.. ఢిల్లీ సోనియా విహార్‌లో(Sonia vihar) నివాసం ఉంటున్న బాలుడి తండ్రి రాజ్‌కుమార్ సాని, అతని భార్య శాంతికి ఓ కుమారుడున్నాడు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దీంతో చిన్నారిని ఎయిమ్స్-ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలుడు బతకడం కష్టమని ఇంటికి తిరిగి వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున హరిద్వార్‌కు చేరుకున్న వారు నమ్మశక్యం కాని దారుణానికి పాల్పడ్డారు. ఘాట్‌లో ఉన్న కొందరు భక్తులు బాలుడిని ఎంతకీ పైకి తీయడం లేదని చూశారు. ఆ మహిళ దగ్గరకు వెళ్లి నీట ముంచిన పిల్లాడిని పైకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే ఆ బాలుడి ప్రాణాలు పోయాయి. పిల్లాడు చనిపోయాడని స్థానికులు బాధపడుతుండగా.. ఆ పిల్లాడిని నీటిలో ముంచిన మహిళ మాత్రం పిచ్చిదానిలా నవ్వుతూ.. తాను చేసిన పనిని సమర్థించుకుంది. బాబు లేచి నిలబడతాడు. గంగమ్మ పిల్లాడిని బతికిస్తుందని ఆమె మాట్లాడడం గమనార్హం. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి తల్లిదండ్రులను, బాలుడిని నీట ముంచిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.