చంద్రయాన్‌-3(chandrayaan-3) విజయం సాధించడంతో యావత్‌ భారతం పులకించిపోయింది. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander) దిగుతున్న అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తూ ఆనందభరితులయ్యారు ప్రజలు. చివరి అంకం ఉత్కంఠభరితంగా సాగింది. సస్పెన్స్‌ సినిమాలోని క్లైమాక్స్‌లా ఫీలయ్యారు చాలా మంది.

చంద్రయాన్‌-3(chandrayaan-3) విజయం సాధించడంతో యావత్‌ భారతం పులకించిపోయింది. జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander) దిగుతున్న అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తూ ఆనందభరితులయ్యారు ప్రజలు. చివరి అంకం ఉత్కంఠభరితంగా సాగింది. సస్పెన్స్‌ సినిమాలోని క్లైమాక్స్‌లా ఫీలయ్యారు చాలా మంది. భావోద్వేగానికి లోనయ్యారు. మన ఇస్రోను, సైంటిస్టులను కొనియాడారు. సెలెబ్రిటీలందరూ తమ సంతోషాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. భారతీయులే కాదు, ప్రపంచంలోని చాలా మంది చంద్రయాన్‌-3 విజయం సాధించిన వైనాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారు.

పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన నటి సెహర్ షిన్వారీ(Sehar Shinwari) కూడా చంద్రయాన్‌-3 ప్రత్యక్ష ప్రసారాన్ని ఆసాంతం వీక్షించారు. చందమామను విక్రమ్‌ ల్యాండర్‌ ముద్దాడిన అపురూప సన్నివేశాన్ని ఆమె కూడా చూసి పులకించారు. మన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భారత్‌కు శుభాకాంక్షలు(Congrats) తెలిపారు. పనిలో పనిగా తన సొంత దేశం పాకిస్తాన్‌పై విమర్శలు చేశారు. భారత్‌తో వైరాన్ని పక్కనపెట్టి ప్రతీ ఒక్కరు ఇస్రోను అభినందించాల్సిందేనని ఆమె అన్నారు. 'భారత్‌-పాకిస్తాన్‌ మధ్య అన్ని అంశాలలో అంతరం బాగా పెరిగింది. భారత్‌ను అందుకోవాలంటే పాకిస్తాన్‌కు రెండు మూడు దశాబ్దాలు పట్టవచ్చు' అని హర్‌ షిన్వారీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో భారత్‌ ఎంత ఎత్తుకు ఎదిగిందో చూసి పాకిస్తాన్ తలదించుకోవాల్సి వస్తుందన్నారు. దురదృష్టవశాత్తు తమకు ఇలాంటి దుస్థితి ఎదురవ్వడానికి కారణం మా ప్రజలే అని తన ఎక్స్‌ (ట్విటర్‌)లో తెలిపారు. హర్‌ షిన్వారీ మద్దతుగా పలువురు పాకిస్థానీయులు కూడా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Updated On 24 Aug 2023 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story