పాకిస్తాన్‌ అమ్మాయి()Pakistan Women)-భారత్‌ అబ్బాయి(India Men). ఇద్దరి మనసులు కలిశాయి. మనువాడదామంటే సవాలక్ష అడ్డంకులు ఎదురయ్యాయి. వారి ప్రేమలో నిజాయితీ ఉంది, బలమూ ఉంది. అందుకే అయిదేళ్లుగా ఎదురవుతున్న ఆ ఆటంకాలను తొలగించుకున్నారు. సరిహద్దులు దాటేసిన ఆ ప్రేమ కొత్త సంవత్సరంలో పెళ్లి బంధంగా మారబోతున్నది.

పాకిస్తాన్‌ అమ్మాయి()Pakistan Women)-భారత్‌ అబ్బాయి(India Men). ఇద్దరి మనసులు కలిశాయి. మనువాడదామంటే సవాలక్ష అడ్డంకులు ఎదురయ్యాయి. వారి ప్రేమలో నిజాయితీ ఉంది, బలమూ ఉంది. అందుకే అయిదేళ్లుగా ఎదురవుతున్న ఆ ఆటంకాలను తొలగించుకున్నారు. సరిహద్దులు దాటేసిన ఆ ప్రేమ కొత్త సంవత్సరంలో పెళ్లి బంధంగా మారబోతున్నది. కాబోయే భర్త కోసం వాఘా-అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లో అడుగుపెట్టింది అమ్మాయి. యువకుడి కుటుంబం ఆమెకు భాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికింది. 2018లో మొదలైన ఈ ప్రేమకథకు ఇన్నాళ్లకు శుభంకార్డు పడింది. కోల్‌కతా(Kolkata)కు చెందిన సమీర్‌ఖాన్‌(samerkhan) జర్మనీ(Germany)లో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట ఇండియా(India)కు వచ్చినప్పుడు తన తల్లి ఫోన్‌లో జావెరియా ఖానుమ్‌ ఫోటో చూశాడు. కరాచీలో నివాసం ఉంటున్న ఈమెపై మనసు పడ్డాడు. పెళ్లంటే చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటానని తల్లికి చెప్పాడు. తల్లి కూడా ఓకే అన్నారు. కాకపోతే పెళ్లికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ఇండియాకు వచ్చేందుకు జావెరియా రెండుసార్లు ప్రయత్నించింది. రెండుసార్లూ ఆమె వీసా రిజెక్ట్‌ అయ్యింది. ఆ తర్వాత కరోనా కష్టాలు వచ్చాయ. అలా చూస్తూ చూస్తూ అయిదేళ్లు గడిచిపోయాయి. ఇంతకాలానికి జావెరియాకు 45 రోజుల వీసా దొరికింది. అమృత్‌సర్‌ నుంచి కోల్‌కతాకు వధూవరులు చేరుకున్నారు. జావెరియాకు వీసా ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి సమీర్‌ఖాన్ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇక పెళ్లి బాజాలు మోగడమే ఆలస్యం!

Updated On 6 Dec 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story