పాకిస్తాన్‌(Pakistan) ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భారత గగనతంలోకి ప్రవేశించింది. ఒకసారి కాదు, రెండుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లడం కలకలం రేపింది. మొత్తంగా పది నిమిషాల పాటు ప్రయాణించింది. పి.కె.48 అనే పీఐఏ విమానం మస్కట్‌ నుంచి పాకిస్తాన్‌కు మే 4న రాత్రి ఎనిమిది గంటల సమయంలో చేరుకుంది.

పాకిస్తాన్‌(Pakistan) ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం భారత గగనతంలోకి ప్రవేశించింది. ఒకసారి కాదు, రెండుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లడం కలకలం రేపింది. మొత్తంగా పది నిమిషాల పాటు ప్రయాణించింది. పి.కె.48 అనే పీఐఏ విమానం మస్కట్‌ నుంచి పాకిస్తాన్‌కు మే 4న రాత్రి ఎనిమిది గంటల సమయంలో చేరుకుంది. అలామా ఇక్బాల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్వాండ్‌ అవ్వాల్సి ఉంది.

అయితే ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో విమానం దిగే పరిస్థితి లేకుండా పోయింది. పైలట్‌ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దాంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ సూచన మేరకు పైలట్‌ కాసేపు గాల్లో తిప్పాల్సి వచ్చింది. అయితే భారీ వర్షం కారణంగా పైలట్ దారి తప్పాడు. విమానం కాస్తా భారత గగనతలంలోకి వచ్చింది.

ఆ టైమ్‌లో విమానం 13, 500 అడుగుల ఎత్తులో గంటకు 292 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. పంజాబ్‌లోని తరన్‌ సాహిబ్‌, రసూల్‌పూర్‌ ప్రాంతాలలో సుమారు 141 కిలోమీటర్లు గాలిలో చక్కర్లు కొట్టింది. 20 వేల అడుగుల ఎత్తులో సుమారు ఏడు నిమిషాల పాటు విమానం అటూ ఇటూ తిరిగంది. తర్వాత పంజాబ్‌లోని జాగియాన్‌ నూర్‌ మహమ్మద్‌ గ్రామం మీదుగా విమానం పాకిస్తాన్‌కు చేరుకుంది.

తర్వాత పాకిస్తాన్‌లోని పంజాబ్‌ స్టేట్‌లో డొనా మబ్బోకి, ఛాంట్‌, ధప్సారి కాసుర్‌, ఘఠి కలంజార్‌ ప్రాంతాలలో తిరిగి మళ్లీ భారత గగనతలంలోకి వచ్చింది. ఈసారి మూడు నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. తర్వాత భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఉన్న లఖా సింఘ్వాలా హిథార్‌ గ్రామం మీదుగా మళ్లీ పాకిస్తాన్‌కు చేరుకుంది.

Updated On 8 May 2023 2:58 AM GMT
Ehatv

Ehatv

Next Story