Pakistan Ex-Minister Fawad Chaudhary : చంద్రయాన్ -3 ప్రయోగంపై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు.. ప్రత్యక్ష ప్రసారం చేయండంటూ విజ్ఞప్తి
చందమామను ముద్దాడే అపురూప క్షణం కోసం యావత్ భారతం ఎదురుచూస్తున్నది. విక్రమ్ ల్యాండర్(Vikram Lander) అడుగుపెట్టే మధుర ఘట్టాన్ని వీక్షించడం కోసం దేశ ప్రజలు సమాయత్తమవుతున్నారు. మనమే కాదు, పొరుగు దేశం పాకిస్తాన్(pakistan) ప్రజలు కూడా చంద్రయాన్-3(Chandrayan-3) ప్రయోగంపై ఆసక్తిగా ఉన్నారు.
చందమామను ముద్దాడే అపురూప క్షణం కోసం యావత్ భారతం ఎదురుచూస్తున్నది. విక్రమ్ ల్యాండర్(Vikram Lander) అడుగుపెట్టే మధుర ఘట్టాన్ని వీక్షించడం కోసం దేశ ప్రజలు సమాయత్తమవుతున్నారు. మనమే కాదు, పొరుగు దేశం పాకిస్తాన్(pakistan) ప్రజలు కూడా చంద్రయాన్-3(Chandrayan-3) ప్రయోగంపై ఆసక్తిగా ఉన్నారు. పాకిస్తాన్ మాజీ మత్రి ఫవాద్ చౌదరి(Fawad Chaudhary) చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రశంసలు కురిపించారు. ఇది చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే దృశ్యాలను పాకిస్తాన్‌లో ప్రత్యక్ష ప్రసారం(Live telecast) చేయాలని అక్కడి మీడియాను కోరారు. గమనించదగ్గ విషయమేమింటే చంద్రయాన్-2 విఫలమైనప్పుడు దేశాన్ని ఎగతాళి చేసిన వారిలో ఫవాద్ చౌదరి కూడా ఉండటం. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో సమాచారా ప్రసార శాఖ మంత్రిగా వ్యవహరించిన చౌదరి చంద్రయాన్-3 ప్రయోగం అద్భుతమని కితాబిచ్చారు. భారతీయ శాస్త్రవేత్తలను, ఇస్రోను అభినందించారు. చంద్రయాన్-3 మానవజాతి చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమన్నారు. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత ఫవాద్ చౌదరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు. ఆ డబ్బులను పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించాల' అని హితవు చెప్పారు. అదే నోటితో నేడు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని ముద్దాడబోతున్నది. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం పాకిస్తాన్ మాత్రమే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.