క్రికెట్ వరల్డ్‌కప్‌లో (cricket world cup)పాకిస్తాన్‌పై (pakistan)మనదే పైచేయిగా ఉంటూ వస్తోంది. ఏ ఫార్మాట్‌ క్రికెట్ అయినా, ఏ వేదిక అయినా మనం గెలవాల్సిందే.. పాకిస్తాన్‌ ఓడాల్సిందే. నిన్న టీ-20 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూయార్క్‌లో (new york) జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్‌పై భారత్(team india)‌ విజయం సాధించింది

క్రికెట్ వరల్డ్‌కప్‌లో (cricket world cup)పాకిస్తాన్‌పై (pakistan)మనదే పైచేయిగా ఉంటూ వస్తోంది. ఏ ఫార్మాట్‌ క్రికెట్ అయినా, ఏ వేదిక అయినా మనం గెలవాల్సిందే.. పాకిస్తాన్‌ ఓడాల్సిందే. నిన్న టీ-20 వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూయార్క్‌లో (new york) జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్‌పై భారత్(team india)‌ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇండియా తక్కువ స్కోరే చేసినప్పటికీ ప్రత్యర్థిని అంతకంటే తక్కువ స్కోరుకు పరిమితం చేసింది. ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే రెండు దేశాల క్రికెట్ అభిమానులు పడి చస్తారు. తమ జట్టే గెలవాలని కోరుకుంటారు. ఇష్ట దైవాలకు మొక్కుకుంటారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు కూడా ఎక్కువమందే ఉంటారు. ఇలాగే పాకిస్తాన్‌ అభిమాని ఒకరు ట్రాక్టర్‌ను (tractor)అమ్ముకుని మరీ ఇండో-పాక్‌ మ్యాచ్‌ టికెట్‌ కొన్నాడు. తమ జట్టు గెలుస్తుందని అనుకున్నాడు కానీ చివరకు అతడిని నిరాశే మిగిలింది. మూడు వేల డాలర్లు పెట్టి మ్యాచ్‌ టికెట్‌ కొనడానికి తన జీవనాధారమైన ట్రాక్టర్‌ను అమ్మానని ఆవేదన చెందాడు. 'ఇండియా స్కోరు చూసినప్పుడు ఈ మ్యాచ్‌లో ఓడిపోతామని అనుకోలేదు. ఆ టార్గెట్‌ను ఈజీగానే ఛేదించగలమని అనుకున్నాను. గేమ్‌ మొత్తం మా చేతుల్లోనే ఉంది. అయితే బాబర్ ఆజం అవుటైన అయిన తర్వాత పాక్‌ అభిమానులు నిరుత్సాహపడ్డారు' అని ఆ అభిమాని చెప్పాడు. చివరి వరకూ పోరాడి మ్యాచ్‌ను నిలబెట్టుకున్న టీమిండియాను అభినందించి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.

Updated On 10 Jun 2024 1:55 AM GMT
Ehatv

Ehatv

Next Story