భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza)- పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక(Shoyab Malik) విడిపోతున్నారనే వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్ల కిందట వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ కథనాలు వచ్చాయి. షోయబ్ మాలిక్‌తో బ్రేకప్ చెప్పేందుకు సానియా సిద్ధమయ్యారన్న టాక్ వినిపించింది.
భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza)- పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక(Shoyab Malik) విడిపోతున్నారనే వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నాళ్ల కిందట వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ కథనాలు వచ్చాయి. షోయబ్ మాలిక్‌తో బ్రేకప్ చెప్పేందుకు సానియా సిద్ధమయ్యారన్న టాక్ వినిపించింది. ఈ జంట విడాకులకు దరఖాస్తు కూడా చేసుకుననారని, ప్రస్తుతం ఇద్దరూ విడివిడగా ఉంటున్నారంటూ పాకిస్తాన్ మీడియా కూడా ప్రచారం చేసింది. తమ దాంపత్యంలో ఎలాంటి అరమరికలు లేవని, ఇద్దరం హాయిగా ఉన్నామని సానియా చెప్పుకొచ్చారు. 'అది మా వ్యక్తిగతమం..
ఆవిషయాన్ని మాకు వదిలేయండి' అంటూ మాలిక్ కూడా వ్యాఖ్యానించారు. దాంతో ఆ రకమైన కథనాలకు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు విడాకుల(Divorce) అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. అందుకు కారణం షోయబ్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చడమే! ఇంతకు ముందు 'అథ్లెట్, సూపర్‌వుమెన్ సానియా మీర్జాకు భర్తను, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని ' అని ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని మార్చేశాడు షోయబ్. తాజాగా ఆయన సూపర్ ఉమెన్ సానియా మీర్జాకు భర్తను అన్న సెంటెన్స్‌ను తొలగించారు.
ప్రో అథ్లెట్-లైవ్ అన్‌బ్రోకెన్‌తో పాటుగా ఓ బిడ్డకు తండ్రిని అన్న సెంటెన్స్‌ను యాడ్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బయో పిక్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. దీంతో షోయబ్ మాలిక్, సానియా విడిపోతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియా కామెంట్స్‌పై ఇప్పటి వరకు అటు సానియా మీర్జా .. ఇటు షోయబ్‌మాలిక్ ఎలాంటి కామెంట్ చేయలేదు.
పాకిస్తాన్‌కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సానియా మీర్జా. వీరి పెళ్లి 2010లో హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
2018లో ఈ దంపతులకు ఓ కొడుకు పుట్టాడు. అతడికి ఇజాన్ అని పేరు పెట్టి అల్లారు ముందుగా పెంచుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి కోవిడ్ తర్వాత అంటే గత ఏడాది నుంచే షోయబ్ మాలిక్, సానియా మీర్జా దాంపత్య జీవితం సాఫీగా సాగడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం మాలిక్‌తో బ్రేకప్ చెప్పేందుకు సానియా మీర్జా రెడీగా ఉన్నారట! పాకిస్తాన్‌కు చెందిన ఓ మోడల్ కారణంగా వీరిద్దని మధ్య విభేదాలు తలెత్తాయంటూ అక్కడి మీడియా పేర్కొంది.
ఈ క్రమంలోనే ఎంతో ఘనంగా జరుపుకునే ఈద్(EID) పండుగ వేళ కూడా ఇద్దరూ వేరువేరు చోట్ల ఉన్నారట! అలాగే ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సానియా వీడ్కోలు మ్యాచ్ కు షోయబ్ మాలిక్ హాజరుకాలేదు. వీటి ఆధారంగానే సానియా-మీర్జా మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయని అంటున్నారు. అయితే ఇలాంటి వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదంటున్నారు మాలిక్. అందుకే తాను కానీ, సానియా కానీ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. సానియాతో కలిసి గడిపేందుకు సమయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఈద్ వేళ తామిద్దరం కలిసి ఉంటే బాగుండేదని, అయితే కొన్ని ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ కారణంగా సానియా రాలేకపోయిందని అన్నారు. ఇద్దరిలో ఎవరికి టైమ్ దొరికినా ఇరు దేశాలకు వచ్చి వెళుతుంటామని, తాము ఎప్పుడూ ప్రేమను పంచుకుంటూ ఉంటామని తెలిపారు.