అంజు(Anju) గుర్తున్నారా? అదేనండి మన దేశానికి చెందిన ఓ 34 ఏళ్ల యువతి స్నేహితుడి కోసం పాకిస్తాన్‌కు(Pakistan) వెళ్లారే!ఆమెనే! ఫేస్‌బుక్(Facebook) ద్వారా పరిచయమైన ఫ్రెండ్ కోసం ఆమె సాహసం చేసి పాకిస్తాన్‌కు వెళ్లారు. ఆ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్నారు.
అంజు(Anju) గుర్తున్నారా? అదేనండి మన దేశానికి చెందిన ఓ 34 ఏళ్ల యువతి స్నేహితుడి కోసం పాకిస్తాన్‌కు(Pakistan) వెళ్లారే!ఆమెనే! ఫేస్‌బుక్(Facebook) ద్వారా పరిచయమైన ఫ్రెండ్ కోసం ఆమె సాహసం చేసి పాకిస్తాన్‌కు వెళ్లారు. ఆ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్నారు. తన పేరును ఫాతిమాగా(Fatima) మార్చుకున్నారు. అప్పట్నుంచి అక్కడే ఉంటున్నారు.
ఏమైందో ఏమో కానీ ఆమెకు మాతృదేశం మీద మమకార కలిగింది. ఇండియాకు వెళ్లడానికి ఆమె ఎన్‌వోసీ పత్రం కోసం ఇస్లామాబాద్‌లోకి హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త నస్రుల్లా(Nusrullah) తెలిపారు. నిరభ్యంతర పత్రం రాగానే అంజు భారత్‌కు వెళతారని ఆయన చెప్పారు.
‘మేము ఇస్లామాబాద్‌లోని అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి ఎన్‌వోసీ (నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం ఎదురు చూస్తున్నాము. దీని కోసం మేము ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాము. ఎన్‌వోసీ ప్రక్రియ పూర్తవడానికి కాస్త సమయం పడుతుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అంజు భారత్‌కు వెళుతుంది' అని నస్రుల్లా తెలిపారు. రాజస్తాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన అంజు రాజస్తాన్‌కు చెందిన అర్వింద్(Arvindh) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు 15 ఏళ్ల కూతురు, ఆరేళ్ల కొడుకు ఉన్నారు. అయితే అంజూకు పాకిస్తాన్‌కు చెందిన 29 ఏళ్ల నస్రుల్లాతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. అతడిని వదల్లేక అంజూ ఉండలేకపోయారు. ప్రేమ కోసం భర్తను, ఇద్దరు పిల్లలను వదిలేసి ఈ ఏడాది జూలైలో వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు.
అక్కడ తన ప్రియుడు నస్రుల్లాను కలిసింది. అక్కడి నుంచి ఖైబర్ ఫంఖ్తుఖ్వా లోని నస్రుల్లా ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమె ఇస్లాం మతం పుచ్చుకున్నారు. తన పేరు ఫాతిమాగా మార్చుకున్నారు. ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు ఏడాది కాలపరిమితి కలిగిన వీసాను మంజూరు చేసింది.