ప్రియుడి కోసం భారత్‌లోకి అక్రమంగా వచ్చిన పాకిస్తాన్ యువతి సీమా హైదర్ (Seema Haider)కు నోయిడా కోర్టు (Noida Court)నోటీసులు పంపంది. నోయిడాకు చెందిన సచిన్ మీనా కోసం అష్టకష్టాలు పడి తన నలుగురు పిల్లలతో భారత్‌లోకి వచ్చిన ఆమె సచిన్‌ను పెళ్లి చేసుకుంది.
ప్రియుడి కోసం భారత్‌లోకి అక్రమంగా వచ్చిన పాకిస్తాన్ యువతి సీమా హైదర్ (Seema Haider)కు నోయిడా కోర్టు (Noida Court)నోటీసులు పంపంది. నోయిడాకు చెందిన సచిన్ మీనా కోసం అష్టకష్టాలు పడి తన నలుగురు పిల్లలతో భారత్‌లోకి వచ్చిన ఆమె సచిన్‌ను పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి చెల్లుబాటు కాదంటూ ఆమె మొదటి భర్త గులాం హైదర్(Ghulam Haider) ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం సీమా హైదర్‌కు నోటీసులు పంపింది. మే 27వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. గులాం హైదర్ తరుఫున భారత్‌కు చెందిన న్యాయవాది మోమిన్ మాలిక్ వాదనలు వినిపించారు. గులాం హైదర్ నుంచి సీమా హైదర్ విడాకులు పొందలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సచిన్‌తో ఆమె పెళ్లి చెల్లదని పేర్కొన్నారు. వాదనలు విన్న కోర్టు దీనిపై నివేదిక సమర్పించాలని నోయిడా పోలీసులకు నోటీసు జారీ చేసింది. లేటెస్ట్‌గా దీనిపై విచారణ జరిపిన కోర్టు సీమా హైదర్‌కు నోటీసులు పంపింది.