జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో 22-05-2025 రోజున మధ్యాహ్నం సుమారు 02:50 ప్రాంతంలో అక్కడి పర్యాటకులపై 4-6 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ లో 22-05-2025 రోజున మధ్యాహ్నం సుమారు 02:50 ప్రాంతంలో అక్కడి పర్యాటకులపై 4-6 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.ఈ ఉగ్రదాడిలో28 మంది టూరిస్టులు ప్రాణాలు విడిచారు.మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

జవాన్ల దుస్తులు ధరించి టెర్రరిస్టులు పర్యాటకులను హతమార్చారు.మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నారు.హిందూవులే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.టూరిస్టుల ఐడీ కార్డులు, ప్యాంట్లు విప్పి హిందువులు అని నిర్దారించుకొని విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారు.

UP, మహారాష్ట్ర, హర్యానా, బెంగళూరు, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఈ ఉగ్రదాడికి బలయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి విహారయాత్ర కోసం వచ్చిన వారి ఇళ్లలో విషాద ఛాయలు మిగిలాయి. విశాఖకు చెందిన చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ అనే ఇద్దరు తెలుగు వాళ్లు కూడా చనిపోయారు.

ఈ దాడికి సూత్రధారి లష్కర్ తొయిబా కమాండర్ సైఫుల్లా కసూరిగా గుర్తించారు. అప్రమత్తమైన భారత ప్రభుత్వం వెంటనే టెర్రరిస్టుల కోసం వేట మొదలుపెట్టింది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ, NIA జాయింట్ ఆపరేషన్ చేస్తోంది.చాపర్స్, డ్రోన్స్ తో బృందాలు జల్లెడ పడుతున్నాయి.

ఇటు సౌదీ పర్యటనను వెంటనే రద్దు చేసుకొని మోడీ భారత్ కు వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలోనే కేంద్ర మంత్రి జయశంకర్, అధికారులతో ప్రధాని సమావేశమయ్యారు. ఉగ్రదాడి జరిగిన తీరు గురించి వారు ప్రధానికి వివరించారు.

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల మృతదేహాలకు అమిత్ షా నివాళులర్పించారు.ఇటు దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలుపుతున్నారు.ఈ కిరాతక దాడికి పాల్పడిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోపక్క ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరులు ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హా ఫోటోలను సెక్యూరిటీ ఏజెన్సీలు విడుదల చేశాయి. ఇవాళ సాయంత్రం మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఉగ్రదాడికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున జమ్మూ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఉగ్రదాడి తర్వాత శ్రీనగర్ విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. విహారయాత్రకు వచ్చిన టూరిస్టులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో కాశ్మీర్ ని వీడారు.

ehatv

ehatv

Next Story