పద్మరాజన్‌(Padma rajan) మళ్లీ బిజీ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా పద్మరాజన్‌ పోటీకి సిద్ధమవుతారు. ఏనాటికైనా ఓనాటికి విజయం వరిస్తుందన్న నమ్మకంతో బరిలో దిగుతారు. ఇప్పటికీ 238 సార్లు ఓటమి చవి చూశారు. అయినా విజయంపై ఎనలేని విశ్వాసం. ఓటమికి గెలుపునకు మొదటి మెట్టుగా భావించే పద్మరాజన్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha Elections) కూడా పోటీ చేస్తున్నారు.

పద్మరాజన్‌(Padma rajan) మళ్లీ బిజీ అయ్యారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా పద్మరాజన్‌ పోటీకి సిద్ధమవుతారు. ఏనాటికైనా ఓనాటికి విజయం వరిస్తుందన్న నమ్మకంతో బరిలో దిగుతారు. ఇప్పటికీ 238 సార్లు ఓటమి చవి చూశారు. అయినా విజయంపై ఎనలేని విశ్వాసం. ఓటమికి గెలుపునకు మొదటి మెట్టుగా భావించే పద్మరాజన్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha Elections) కూడా పోటీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల దగ్గర్నుంచి రాష్ట్రపతి ఎన్నికల(Elections) వరకు ఆయన పోటీ చేయని ఎన్నిక లేదంటే నమ్మండి. తమిళనాడుకు చెందిన టైర్ల రిపైర్‌ షాపుకు పద్మరాజన్‌ యజమాని. దక్షిణ తమిళనాడు మెట్టూరు పట్టణానికి చెందిన 65 ఏళ్ల పద్మరాజన్‌ ఎవరేమనుకున్నా లెక్క చేయరు. ప్రతి ఎన్నికలో తాను పోటీ చేస్తుండటంతో అందరూ నవ్వేవారని, అవేమీ తాను లెక్క చేయనని పద్మరాజన్‌ అంటున్నారు. ఎన్నికల్లో సామాన్యుడు భాగం కావడంపైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో పాల్గొనడమే తన విజయంగా భావిస్తానని, ఓటమిని ఆనందంగా స్వాగతిస్తానని తెలిపారు. పద్మరాజన్‌ను స్థానికులు ముద్దుగా ఎలక్షన్‌ కింగ్‌ అని పిల్చుకుంటారు. 1988 నుంచి అనేక ఎన్నికల్లో పోటీ చేస్తున్న పద్మరాజన్‌ ప్రముఖులందరిపైనా పోటీ చేశారు. అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీలను కూడా వదల్లేదు. ఎన్నికల్లో పోటీ చేయటం అంత ఈజీ కాదంటున్న పద్మరాజన్‌ ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వేల రూపాయాలు పొగొట్టుకున్నానని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌గా పాతిక వేల రూపాయలు కట్టాల్సి వస్తుందని, ఎన్నికల్లో పోల్‌ అయ్యే ఓట్లలో 16 శాతం ఓట్లు పడకపోతే పెట్టిన సెక్యూరిటీ డిపాజిట్‌ గల్లంతు అయినట్టేనని పద్మరాజన్‌ తెలిపారు. ఎన్నికల్లో గెలవకపోయినా దేశంలోనే పలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవటంలో లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించానని, ఓ రకంగా అది కూడా గెలుపేనని అన్నారు. 2011లో కొంతలో కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచారని, అప్పుడు మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి 6,273 ఓట్లు సంపాదించానని అన్నారు. గెలిచిన వ్యక్తికి 75 వేల ఓట్లు వచ్చాయని, ఆ ఎన్నికలో కనీసం ఒక్క ఓటు కూడా వస్తుందని అనుకోలేదని పేర్కొన్నారు. పద్మరాజన్‌కు టైర్‌ రిపేర్‌ మాత్రమే వస్తుందనుకుంటున్నారా? ఆయనకు హోమియోపతి మందులను తయారుచేయడం వచ్చు. అలాగే లోకల్ మీడియాకు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్నికల బరితో దిగటమే తనకు సంతృప్తినిస్తుందని చెప్పారు. ఆఖరి శ్వాస వరకు ఎన్నికల్లో పోటీ చేస్తునే ఉంటానని అంటున్న పద్మరాజన్‌ ఎప్పుడైనా ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం షాక్‌ అవుతానని అన్నారు.

Updated On 28 March 2024 4:00 AM GMT
Ehatv

Ehatv

Next Story