ఏప్రిల్ 25న వారణాసిలో పీడీఎం న్యాయ్ మోర్చా బహిరంగ సభలో ప్రసంగిస్తూ మతతత్వ ప్రకటనలు చేసినందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి నోటీసు జారీ కానుంది
ఏప్రిల్ 25న వారణాసిలో పీడీఎం న్యాయ్ మోర్చా బహిరంగ సభలో ప్రసంగిస్తూ మతతత్వ ప్రకటనలు చేసినందుకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి నోటీసు జారీ కానుంది. జిల్లా ఎన్నికల అధికారి తరపున అదనపు రిటర్నింగ్ అధికారి నోటీసు జారీ చేయనున్నారు. వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ మతతత్వ ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ కాశీ ప్రాంత బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ శశాంక్ శేఖర్ త్రిపాఠి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందిందని ధృవీకరిస్తూ.. ప్రాథమిక విచారణ తర్వాత.. ఒవైసీకి నోటీసు జారీ చేస్తున్నట్లు అదనపు రిటర్నింగ్ అధికారి సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ నీరజ్ పటేల్ ఆదివారం తెలిపారు. గత గురువారం జరిగిన సమావేశంలో ముఖ్తార్ అన్సారీని జ్యుడీషియల్ కస్టడీలో చంపేశారని ఒవైసీ ఆరోపించారు. ఆయన అమరవీరుడు.. అలాంటి వ్యక్తులు ఎన్నటికీ చనిపోరు అని వ్యాఖ్యానించారు. వారిని రక్షించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే.. కానీ విఫలమైందని ఆయన అన్నారు. ఒవైసీ తన 40 నిమిషాల ప్రసంగంలో.. ప్రధాని నరేంద్ర మోదీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లను తీవ్రంగా టార్గెట్ చేశారు. "అఖిలేష్ యాదవ్ కుటుంబంలో సగం మంది ప్రధాని నరేంద్ర మోడీతో కూర్చుని టీ తాగుతున్నారు. మా ప్రాణాలను వదులుకోమని అంటున్నారని ఒవైసీ అన్నారు.