పార్లమెంట్‌ కొత్త భవనం(New Parliament Bulding) ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ పట్టించుకోకపోవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి.

పార్లమెంట్‌ కొత్త భవనం(New Parliament Bulding) ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ పట్టించుకోకపోవడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. 19 రాజకీయపార్టీలు ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్‌పార్టీ, డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీ, శివసేన (ఉద్ధవ్‌ థాక్రే వర్గం), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, జార్ఖండ్‌ ముక్తిమోర్చ. కేరళ కాంగ్రెస్‌, రాష్ట్రీయ లోక్‌దళ్‌, తృణమూల్ కాంగ్రెస్‌పార్టీ, జనతాదళ్‌ (యునైటెడ్‌), ఎన్‌.సి.పి, రాష్ట్రీయ జనతాదళ్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, రెవెల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కజగం, విడుదలై చిరుతంగల్‌ కట్చిలు ఈ విషయంపై సంయుక్త ప్రకటన చేశాయి. పార్లమెంట్‌ అనేది కేవలం ఒక భవనం కాదని, దేశ ప్రజాస్వామ్యానికి అది పునాది అని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌ చెప్పారు. ఇది ప్రధాని మోదీ సొంత వ్యవహారం కాదని అన్నారు. 2020 డిసెంబర్‌లో కొత్త పార్లమెంట్‌ నిర్మాణ శంకుస్థాపన పనులను ప్రతిపక్షాలు బహిష్కరించిన విషయం విదితమే!

Updated On 24 May 2023 1:20 AM GMT
Ehatv

Ehatv

Next Story