ప్రతిపక్ష కూటమి I.N.D.I.A ఎంపీలు ఇంఫాల్‌లోని(Imphal) రాజ్‌భవన్‌లో(Rajbhavan) మణిపూర్(Manipur) గవర్నర్ అనుసూయా ఉయికేని(Anusuya Uike) కలిశారు. ఈ స‌ద‌ర్భంగా గవర్నర్ అనుసూయా ఉయికేకి వారు ఓ మెమోరాండం సమర్పించారు. అనంత‌రం.. కాంగ్రెస్(COngress) ఎంపీ అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chaudhary) విలేకరులతో మాట్లాడారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ప్ర‌భుత్వం పట్టించుకోకపోవడమే ప్రధానకార‌ణ‌మన్నారు.

ప్రతిపక్ష కూటమి I.N.D.I.A ఎంపీలు ఇంఫాల్‌లోని(Imphal) రాజ్‌భవన్‌లో(Rajbhavan) మణిపూర్(Manipur) గవర్నర్ అనుసూయా ఉయికేని(Anusuya Uike) కలిశారు. ఈ స‌ద‌ర్భంగా గవర్నర్ అనుసూయా ఉయికేకి వారు ఓ మెమోరాండం సమర్పించారు. అనంత‌రం.. కాంగ్రెస్(COngress) ఎంపీ అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chaudhary) విలేకరులతో మాట్లాడారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ప్ర‌భుత్వం పట్టించుకోకపోవడమే ప్రధానకార‌ణ‌మన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి అన్ని సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని గ‌వ‌ర్న‌ర్‌ను అభ్యర్థించిన‌ట్లు తెలిపారు. గత 89 రోజులుగా మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. తద్వారా మణిపూర్‌లో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా అభ్యర్థించిన‌ట్లు వెల్ల‌డించారు.

అవకాశం దొరికిన వెంటనే.. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలు లేవనెత్తిన సమస్యలను, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల పక్షాన ఇక్కడ చూసిన లోటుపాట్లను తెలియ‌జేస్తామ‌ని వెల్ల‌డించారు. ఆలస్యం చేయవద్దని, మా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని, మణిపూర్ సమస్యపై చర్చించాలని మేము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇది జాతీయ భద్రత ఆందోళనలను పెంచుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులకు పరిష్కారం కనుగొనేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని గవర్నర్‌ సూచించారని చెప్పారు.

Updated On 30 July 2023 2:19 AM GMT
Ehatv

Ehatv

Next Story