రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడం ప్రారంభించాయి. బెంగళూరులో జరిగిన ఉమ్మడి ప్రతిపక్షాల రెండో రోజు సమావేశానికి కాంగ్రెస్ సహా మొత్తం 26 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో విపక్షాల కూట‌మికి కొత్త పేరు పెడుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. విప‌క్ష కూట‌మికి 'I-N-D-I-A' అని నామ‌క‌ర‌ణం చేశారు.

రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections) కోసం ప్రతిపక్షాలు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడం ప్రారంభించాయి. బెంగళూరులో జరిగిన ఉమ్మడి ప్రతిపక్షాల రెండో రోజు సమావేశానికి కాంగ్రెస్(Congress) సహా మొత్తం 26 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో విపక్షాల కూట‌మికి కొత్త పేరు పెడుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. విప‌క్ష కూట‌మికి 'I-N-D-I-A' అని నామ‌క‌ర‌ణం చేశారు. యూపీఏ పేరును మార్చాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకురాగా.. దీనికి అందరూ మద్దతు పలికారు.

I-N-D-I-A పూర్తి పూర్తి పేరు భారత జాతీయ ప్రజాస్వామ్య సమ్మిళిత కూటమి((Indian National Democratic Inclusive Alliance)గా పేర్కొన్నారు. ఇక‌పై కూట‌మిని యూపీఏకు బదులుగా INDIA గా పిలువ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge) విప‌క్ష కూట‌మి పేరు మార్పును అధికారికంగా ప్రకటించారు.

బెంగళూరులో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా మొత్తం 26 పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi), మమతా బెనర్జీ(Mamata Banerjee), శరద్ పవార్(Sharad Pawar), అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) వంటి ముఖ్య‌ నేతలు పాల్గొన్నారు. విపక్ష పార్టీల తదుపరి సమావేశం ముంబైలో జరగనుంది. ఈ సమావేశంలో11 మంది నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పేరు మార్పు తర్వాత ఆర్జేడీ బీజేపీపై విరుచుకుపడింది. ఇప్పుడు బీజేపీ(BJP)ని ఇండియా అని పిలవడం కష్టమని ఆర్జేడీ(RJD) పేర్కొంది.

ఇది ఎన్డీయే-I-N-D-I-A మధ్య పోరు అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోదీకి, I-N-D-I-Aకు మధ్య పోరు నడుస్తుంది. మేము కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాము. మా భావజాలం, దేశం కోసం ఏమి చేయబోతున్నాం అనే విష‌యమై మాట్లాడుకున్నాం. ఇది విపక్షాలకు, బీజేపీకి మధ్య పోరు కాదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ప్ర‌శ్నించే గొంతు నలిగిపోతోంది. ఈ పోరాటం దేశం కోసం.. అందుకే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (INDIA) అనే పేరును ఎంచుకున్నట్లు తెలిపారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ.. 26 పార్టీలు సమావేశమయ్యాయని.. ఇది రెండవ సమావేశం.. ఈ కుటుంబం అభివృద్ధి చెందడం మంచి విషయమని అన్నారు. ఈరోజు 26 పార్టీలు తమ కోసం క‌ల‌వ‌లేదు. దేశాన్ని ద్వేషం నుండి కాపాడేందుకు.. నవ భారత్ కల కోసం అంద‌రం సమావేశమయ్యామని అన్నారు.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddav Thackrey) మాట్లాడుతూ.. రాజకీయాల్లో భిన్నమైన సిద్ధాంతాలు ఉంటాయని, అయితే దేశం కోసం మనం ఒక్కటేనని అన్నారు. కుటుంబాన్ని కాపాడేందుకు మనం ఒక్కటయ్యామని, దేశమే మన కుటుంబమని, దాన్ని కాపాడేందుకు ఒక్కటయ్యామని ప్రజలు భావిస్తున్నారు. ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం అన్నారు.

మన ఐక్యత చూసి మోదీ 30 పార్టీల సమావేశానికి పిలుపునిచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇంతకుముందు పొత్తు గురించి కూడా మాట్లాడని వారు.. ఎన్నో పావులు కదిపి ఇప్పుడు మోదీ జీ ఆ ముక్కలను కలిపే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Updated On 18 July 2023 7:57 AM GMT
Yagnik

Yagnik

Next Story