ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత్‌(India) నుంచి అమెరికాకు(America) వెళ్లారు. తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వెల్లడైన లెక్కలను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో వాలిపోవడానికి ఫ్లైట్‌ ఎక్కుతున్నారు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో భారత్‌(India) నుంచి అమెరికాకు(America) వెళ్లారు. తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం.. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే వారిలో భారతీయ విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వెల్లడైన లెక్కలను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో వాలిపోవడానికి ఫ్లైట్‌ ఎక్కుతున్నారు.

2023-24లో భారత్‌ నుంచి చదువుల కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులు 2,68,923 మంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి అమెరికాకు చదువుకునేందుకు వెళ్లిన వారి సంఖ్య దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని లెక్కలు చెప్పారు. తాజాగా వెల్లడైన ఓపెన్ డోర్స్ నివేదికను(Open doors Report) చూస్తే ఈ లెక్కలు బయటపెడతాయి. అన్ని దేశాలతో పోల్చి చూస్తే అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో 26 శాతం మంది భారతీయ విద్యార్థులే(Indian Students) ఉండటం గమనార్హం. తాజా లెక్కల ప్రకారం కరోనాకు(Corona) ముందు అమెరికాకు వెళ్లి చదువుకునే విదేశీ విద్యార్థుల సంఖ్య చేరుకుంది.

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికా వర్సిటీల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పన్నెండు శాతం పెరిగింది. గడిచిన 40 ఏళ్లలో ఇదే ఎక్కువని లెక్కలు చెప్తున్నాయి. అమెరికా వర్సిటీల్లో చేరే విదేశీ విద్యార్థుల్లో చైనాదే ప్రథమ స్థానం. 2022-23లో చైనా దేశం నుంచి 2.90 లక్షల మంది వెళ్లారు. ఆ తర్వాత స్థానంలో భారత్‌కు చెందిన విద్యార్థులు 2.68 లక్షల మంది ఉన్నారు. మరో విషయమేంటంటే.. అంతర్జాతీయంగా గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 2009-10 తర్వాత తొలిసారి చైనాను భారత్ అధిగమించటం విశేషం.

భారత్ నుంచి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. చైనా నుంచి గడిచిన మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. చైనా, భారత్ తర్వాత దక్షిణకొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, నైజీరియాకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. అమెరికా గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో విద్యార్థుల ఎక్కువగా సైన్స్.. టెక్నాలజీ.. బిజినెస్ విభాగాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రాంలో 21 శాతం పెరుగుదల ఉండగా. మ్యాథ్స్.. కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఆ తర్వాత ఇంజినీరింగ్.. బిజినెస్ విభాగాలు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. లక్ష రూపాయల జీతాలు వస్తాయని.. అక్కడి ఉద్యోగాలపై విదేశీ విద్యార్థులకు క్రేజ్‌ ఉండడం కూడా అమెరికా వెళ్లేందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated On 14 Nov 2023 7:53 AM GMT
Ehatv

Ehatv

Next Story