భారతదేశంలాంటి(India) అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను(Election) నిర్వహించడం అంత ఆషామాషీ విషయం కాదు. ఎలెక్షన్ కమిషన్ ఒక్కటే ఈ బాధ్యతను నిర్వర్తించలేదు. అన్ని శాఖల సమన్వయంతోనే ఎన్నికలను సజావుగా నిర్వహించగలగుతోంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా ఉండేందుకు సకల జాగ్రత్తలు తీసుకుంటారు. వేసిన వారే మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు ఓటరు వేలిపై ప్రత్యేకమైన బ్లూ ఇంక్‌ను(Blue Ink) మార్క్‌గా వేస్తారు.
భారతదేశంలాంటి(India) అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను(Election) నిర్వహించడం అంత ఆషామాషీ విషయం కాదు. ఎలెక్షన్ కమిషన్ ఒక్కటే ఈ బాధ్యతను నిర్వర్తించలేదు. అన్ని శాఖల సమన్వయంతోనే ఎన్నికలను సజావుగా నిర్వహించగలగుతోంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగకుండా ఉండేందుకు సకల జాగ్రత్తలు తీసుకుంటారు. వేసిన వారే మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు ఓటరు వేలిపై ప్రత్యేకమైన బ్లూ ఇంక్‌ను(Blue Ink) మార్క్‌గా వేస్తారు. వేలి మీద వేసిన ఆ మార్క్ కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఈ స్పెషల్ ఇంక్‌ను కర్ణాటకలోని మైసూరులో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నీష్ లిమిటెడ్ (MPVL) కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది. మరే కంపెనీకి అనుమతి లేదు. అసలు ఈ ఇంక్‌ను ఎలా తయారు చేస్తారో మిగతా కంపెనీలకు తెలియదు. ఆ మాటకొస్తే ఎంపీవీఎల్ డైరెక్టర్లకు కూడా ఈ ప్రత్యేక ఇంక్ తయారీ ఫార్ములా తెలియదు. అందులో పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు మాత్రమే ఇంక్ తయారీ విధానం గురించి తెలుసు. ఆ ఇద్దరిలో ఒకరు పదవీ విరమణ చేసినా, మరేదైనా ప్రమాదం జరిగినా నమ్మకస్తులైన తమ తర్వాతి ఉద్యోగులకు ఆ ఫార్ములాను చెబుతారు. అన్నట్టు ఆ ఇద్దరు కెమిస్టులు కలిసి ప్రయాణం చేయరు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం 55 కోట్ల రూపాయల విలువైన 26.55 లక్షల ఇంక్ వయల్స్‌ను వాడబోతున్నారు.