తాజ్‌మహల్‌పై(Taj Mahal) ఈ మధ్యన కొందరు ఇష్టానికి మాట్లాడేస్తున్నారు. బాబ్రీ మసీదులాగే(Babri Masjid) దీన్ని కూడా కూల్చేస్తామని అన్నవారు కూడా ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా అదో ప్రపంచపు వింత! దాన్ని ఇష్టపడేవారే ఎక్కువ. దాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారే ఎక్కువ. ఆ అద్భుత పాలరాతి కట్టడాన్ని సందర్శించాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చేవారు ముందు చూడాలనుకునేది తాజ్‌మహల్‌నే(Taj Mahal).

తాజ్‌మహల్‌పై(Taj Mahal) ఈ మధ్యన కొందరు ఇష్టానికి మాట్లాడేస్తున్నారు. బాబ్రీ మసీదులాగే(Babri Masjid) దీన్ని కూడా కూల్చేస్తామని అన్నవారు కూడా ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా అదో ప్రపంచపు వింత! దాన్ని ఇష్టపడేవారే ఎక్కువ. దాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారే ఎక్కువ. ఆ అద్భుత పాలరాతి కట్టడాన్ని సందర్శించాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చేవారు ముందు చూడాలనుకునేది తాజ్‌మహల్‌నే(Taj Mahal). అందుకే రోజూ పర్యాటకులతో కిటకిటలాడిపోతుంటుంది. అసలీ నిర్మాణానికి ఎంత ఆదరణ ఉన్నదంటే కరోనా కాలంలో అన్నీ స్థంభించిపోయినా తాజ్‌మహల్‌ను సందర్శించడానికి పర్యాటకులు వచ్చారు.

ఇంత క్రేజ్‌ ఉన్న తాజ్‌మహల్‌ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? ప్రతీ ఏడాది తాజ్‌మహల్‌ సందర్శనకు సంబంధించి ఎన్ని టికెట్లు అమ్మడవుతున్నాయో తెలుసా? అధికారిక సమాచారం ప్రకారం తాజ్‌మహల్‌ సందర్శనకు ప్రతీ ఏడాది సుమారు 80 లక్షలమంది పర్యాటకులు వస్తుంటారు. వీరిలో 80 వేల మంది విదేశీయులు(foreigners) ఉంటారు. తాజ్‌మహల్‌ సందర్శనకు స్థానికుల నుంచి అంటే భారతీయుల నుంచి 50 రూపాయలు వసూలు చేస్తారు. అదే విదేశీయులు అయితే 1,100 రూపాయలు ఇచ్చి ఎంట్రీ టికెట్‌ తీసుకోవాలి. 2017-2018 నుంచి 2021-2022 మధ్యకాలంలో అంటే మూడేళ్ల వ్యవధిలో తాజ్‌మహల్‌ నుంచి 152 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

ఇది చారిత్రాత్మక కట్టడాల(Historical Constructions) నుంచి వచ్చిన ఆదాయంలో 40 శాతం అంటే తాజ్‌మహల్‌ ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని పర్యాటకుల కారణంగా తాజ్‌మహల్‌కు టిక్కెట్ల రూపంలో ప్రతీ సంవత్సరం 40 కోట్ల రూపాయలు, విదేశీయులకు విక్రయించే టిక్కెట్ల కారణంగా 110 కోట్ల రూపాయలు ఆదాయంగా వస్తుంటుంది. పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయపరంగా చూస్తే తాజ్‌మహల్‌ మొదటి స్థానంలో ఉంటుంది. 2021-2022లో తాజ్‌మహల్‌ సందర్శన టిక్కెట్ల అమ్మకాలతో సుమారు పాతిక కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట నుంచి కూడా ఆదాయం ఎక్కువగానే వస్తుంది.

Updated On 12 Jun 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story