కర్నాటకలోని ఈస్ట్ బెంగళూరులో హొరమావు అగారా ఏరియాలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
కర్నాటకలోని ఈస్ట్ బెంగళూరులో హొరమావు అగారా ఏరియాలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.
కూలుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు బాధ్యులపై కేసులు నమోదు చేశారు. భవనం యజమాని మునిరాజరెడ్డి(Munirajareddy), మోహన్‌రెడ్డి(Mohan Reddy), ఏలుమలై (Elumalai)అనే వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేశారు. వీరిపై బృహత్ బెంగళూరు(Bengaluru) మహానగర పాలక సంస్థ చట్టంలోని వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసిట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం భవన యజమాని మునిరాజరెడ్డి కుమారుడు భువన్‌రెడ్డి(Bhuvan Reddy), కాంట్రాక్టర్ యునియప్ప(Muniyappa) తమ అదుపులో ఉన్నారని బెంగళూరు ఈస్ట్ డీసీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం వెతుకుతున్నామన్నారు. సాయంత్రం వేళ భవనంలో పనులు జరుగుతుండగా భవనం కూలిపోవడంతో పలువురు కూలీలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో అయిదుగురు చనిపోయారు.