ఉత్తరాఖండ్‌లోని(Uttarkhand) కేదార్‌నాథ్ ధామ్‌లో(Kedarnath Dham) కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది.
ఉత్తరాఖండ్‌లోని(Uttarkhand) కేదార్‌నాథ్ ధామ్‌లో(Kedarnath Dham) కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 9న కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంటుంది. ఈ నెల 10న ఉదయం 7 గంటలకు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు భక్తుల పూజల కోసం తెరుచుకుంటాయి.
కుంటాయని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(bktc) ప్రకటించింది. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయ వద్ద బీకేటీసీ ఛైర్మన్ అజేంద్ర అజయ్(ajendra ajay) ఈ విషయం వెల్లడించారు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే కేదార్‌నాథ్ ఆలయ పోర్టల్స్ శీతాకాలం మూతపడతాయి.
ఏటా పెద్ద ఎత్తున భక్తులు కేదార్ నాథ్ క్షేత్రానికి వెళ్తుంటారు. గత ఏడాది యాత్రా కాలంలో రికార్డు స్థాయిలో కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారని, ఈ ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరగనుందని ఆయన అన్నారు.