ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలో కూర్చున్న రెజ్లర్లు.. మహిళా సమ్మాన్ మహాపంచాయత్ లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ వైపు వెళ్తుండగా.. పోలీసులు నిరసనకారులందరినీ అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద దాదాపు 35 రోజులుగా సమ్మె చేస్తున్న మల్లయోధులు.. ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా మహిళా సమ్మాన్ మహాపంచాయత్ కు పిలుపునిచ్చారు.

ఢిల్లీ(Delhi)లోని జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద ధర్నాలో కూర్చున్న రెజ్లర్లు.. మహిళా సమ్మాన్ మహాపంచాయత్(Mahila Samman Mahapanchayat) లో భాగంగా కొత్త పార్లమెంట్ హౌస్ వైపు వెళ్తుండగా.. పోలీసులు(Ploice) నిరసనకారులందరినీ అదుపు(Arrest)లోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద దాదాపు 35 రోజులుగా సమ్మె చేస్తున్న మల్లయోధులు.. ఆదివారం నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా మహిళా సమ్మాన్ మహాపంచాయత్ కు పిలుపునిచ్చారు. మహిళా మహాపంచాయత్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు భద్రతను పెంచారు. దీంతో రహదారులపై ట్రాఫిక్‌ జామ్‌ సమస్య తలెత్తింది. మహిళా మహాపంచాయత్‌లో పాల్గొన‌డానికి రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవడంతో వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు.

సాక్షి మాలిక్‌(Sakshi Malik)ను అదుపులోకి తీసుకుంటుండగా ఆమె ఓ మహిళా పోలీసు కడుపుపై ​​దాడి చేసిందని.. గాయం కారణంగా మహిళా పోలీసు స్పృహతప్పి పడిపోయిందని చెబుతున్నారు. ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించిన‌ట్లు చెబుతున్నారు. రెజ్లర్ సంగీతా ఫోగట్‌(Sangeeta Phogat)ను జంతర్ మంతర్ వ‌ద్ద‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంద‌రినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు నిరసన స్థలం నుంచి టెంట్లను తొలగించారు.

Updated On 28 May 2023 2:26 AM GMT
Yagnik

Yagnik

Next Story