ప్రస్తుతం మళ్ళీ విదేశీయులకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లు మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది అంటూ ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ చెక్ చేసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆర్బిఐ లెటర్ ఫేక్ అని తేల్చి చెప్పింది.

ఇంతకీ ఆ లెటర్‎లో ఏముంది అనే విషయానికి వస్తే ఆర్బిఐ పాత కరెన్సీ నోట్లకు సంబంధించి వీటిని మార్చుకునేందుకు ఒక గడుపు విధించిందని అలాగే ప్రస్తుతానికి విదేశీయులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది అని ఉంది. 2016 నవంబర్ 8న 500 రూపాయలనోట్లు 1000 రూపాయలు నోట్లు చెల్లుబాటుకావని కేంద్రం ప్రకటించింది ఆ తర్వాత కొంత గడువు కరెన్సీ నోట్ల మార్పిడికి కేంద్రం అనుమతి ఇచ్చింది. బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది .

ప్రస్తుతం మళ్ళీ విదేశీయులకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లు మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది అంటూ ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ చెక్ చేసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆర్బిఐ లెటర్ ఫేక్ అని తేల్చి చెప్పింది.

విదేశీయులు సైతం 500 రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు మార్చుకోవడానికి ఇచ్చిన గడువు 2017 లోనే పూర్తయిందని అది ఇప్పట్లో అమలులో లేదని తేల్చి చెప్పేసింది.ఒకవేళ మీరు ఈ ఆర్.బి.ఐ కు సంబంధించిన ఫేక్ లెటర్ ని కనుక చూస్తుంటే ఇది తప్పుడు వార్తగా గమనించండి. ఇలాంటి ఫేక్ మెసేజెస్ ద్వారా ఫేక్ లింక్స్ ద్వారా చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు
ఇలాంటి విషయాల్లో వినియోగదారులు జాగ్రత్తలు వహించాలని కేంద్రం ఇప్పటికే సూచిస్తుంది

Updated On 10 March 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story