రైడ్‌ క్యాన్సిల్‌ చేసినందుకు యువతిపై చేయి చేసుకున్నాడు..

బెంగళూరులో(Bangalore) ఓ షాకింగ్‌ సంఘటన జరిగింది. ఓ యువతి ఓలా(Ola) యాప్‌లో క్యాబ్‌ బుక్‌ చేసుకున్నారు. తర్వాత మరో చోటుకు వెళ్లడం కోసం ఆమె రైడ్‌ను క్యాన్సిల్‌ చేసుకుని మరో ఆటో ఎక్కారు. ఈ సమయంలోనే ఆ ఓలా ఆటో డ్రైవర్‌ లోకేషన్‌కు వచ్చేశాడు. ఆమె మాత్రం మరో ఆటోలో ఎక్కారు. తన రైడ్‌ను ఎందుకు క్యాన్సిల్‌ చేశావంటూ ఆ డ్రైవర్‌ ఆమెతో గొడవకు దిగారు. అందుకు ఆమె ' నా ఇష్టం.. నేను రైడ్‌ క్యాన్సిల్‌ చేసుకుంటా .. నీకు ఎందుకు' అని జవాబిచ్చారు. కొన్నిసార్లు క్యాబ్ డ్రైవర్లు కూడా క్యాన్సిల్‌ చేస్తుంటారు కదా అని ఆమె అడిగింది. దానికి ఆ ఆటోడ్రైవర్‌ కోపంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. పోలీస్‌స్టేషన్‌కు(Police station) వెళదామంటూ ఆమె అన్నది. దాంతో ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ ఆ యువతిని చెంప దెబ్బ కొట్టాడు. తనను ఎందుకు కొట్టావంటూ ఆ యువతి అడుగుతున్నా ఆ డ్రైవర్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు. దేనికైనా రెడీ అన్నట్టుగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ ఆటో డ్రైవర్‌ను తిట్టిపోస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Eha Tv

Eha Tv

Next Story